20 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు

28 Jan, 2019 10:37 IST|Sakshi

మౌంట్‌ మాంగనీ : భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్‌ 198 పరుగుల వద్ద  ఆరో వికెట్‌ను కోల్పో‍యింది. టామ్‌ లాథమ్‌, హెన్రీ నికోలస్‌, సాంత్నార్‌లు స‍్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరడంతో కివీస్‌ ఆరో వికెట్‌ను నష్టపోయింది.. 62 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత లాథమ్‌ నాల్గో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. భారత స్పిన్నర్‌ చహల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన లాథమ్‌.. అంబటి రాయుడుకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. మరో 13 పరుగుల వ్యవధిలో హెన్రీ నికోలస్‌(6)ను హార్దిక్‌ పాండ్యా ఔట్‌ చేశాడు. ఆపై హార్దిక్‌ వేసిన మరో ఓవర్‌లో సాంత్నార్‌ పెవిలియన్‌ చేరాడు. దాంతో 20 పరుగుల వ్యవధిలో కివీస్‌ మూడు వికెట్లను చేజార్చుకుంది. అంతకుముందు రాస్‌ టేలర్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన తొలుత బ్యాటింగ్ తీసుకున్న కివీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మున్రో(7) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆపై కాసేపటికి గప్టిల్‌(13) కూడా ఔటయ్యాడు. దాంతో 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కివీస్‌ కోల్పోయింది. ఆ తరుణంలో కేన్‌ విలియమ్సన్‌-రాస్‌ టేలర్‌ జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 33 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్‌(28) పెవిలియన్‌ బాట పట్టాడు. అటు తర్వాత టేలర్‌-లాథమ్‌లు స్కోరు బోర్డును చక్కదిద్దారు. ఈ జంట 119 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో కివీస్‌ తేరుకుంది. ఈ క్రమంలోనే ముందుగా టేలర్‌ హాఫ్‌ సెంచరీ చేయగా, లాథమ్‌ కూడా అర్థ శతకంతో మెరిశాడు.  హాఫ్‌ సెంచరీ సాధించిన లాథమ్‌ స్కోరును పెంచే క్రమంలో ఔటయ‍్యాడు. కాసేపటికి హెన్రీ నికోలస్‌, సాంత్నార్‌లు ఔటయ్యారు.

మరిన్ని వార్తలు