పాక్‌పై గెలుపు; భాంగ్రా స్టెప్పులేసిన కివీస్‌ ఆటగాళ్లు

20 Nov, 2018 20:45 IST|Sakshi

‘ఓయ్‌ హోయ్‌’ ట్రోఫీలో భాగంగా అబుదాబి వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌ స్ఫూర్తిదాయక విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఏడు నెలల విరామం తర్వాత టెస్టు మ్యాచ్‌ బరిలోకి దిగిన కివీస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం కోల్పోయినా... చివర్లో ప్రత్యర్థి జట్టును కట్టడిచేసి కేవలం నాలుగు పరుగుల తేడాతో గెలుపు బావుటా ఎగురవేసింది. అయితే ఈ థ్రిల్లింగ్‌ విక్టరీని కివీస్‌ ఆటగాళ్లు సెలబ్రేట్‌ చేసుకున్న తీరు ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది.

డ్రెస్సింగ్‌ రూంలో భాంగ్రా స్టైల్లో వీరు వేసిన స్టెప్పులకు భారత అభిమానులు ఫిదా అవుతున్నారు. టీమిండియా క్రికెటర్లు భజ్జీ, యూవీలను ట్యాగ్‌ చేస్తూ.. ‘న్యూజిలాండ్‌ డ్రెస్సింగ్‌ రూంలో పంజాబీ పాటలు.. వహ్వా’ అంటూ మురిసిపోతున్నారు. కాగా ఈ వీడియోను పాకిస్తాన్‌కు చెందిన ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయడం విశేషం.

మరిన్ని వార్తలు