దక్షిణాఫ్రికాకు మరో విజయం

26 Feb, 2017 02:56 IST|Sakshi
దక్షిణాఫ్రికాకు మరో విజయం

వెల్లింగ్టన్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన దక్షిణాఫ్రికా... న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన మూడో వన్డేలో 159 పరుగులతో నెగ్గింది. మొదట దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 271 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ (85; 7 ఫోర్లు, ఒక సిక్స్‌), డి కాక్‌ (68; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్‌ ద్వారా డివిలియర్స్‌ వన్డేల్లో అత్యంత వేగంగా (205 ఇన్నింగ్స్‌లో), తక్కువ బంతుల్లో (9,005) 9 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. సౌరభ్‌ గంగూలీ (228 ఇన్నింగ్స్‌లో), గిల్‌క్రిస్ట్‌ (9,328 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డులను డివిలియర్స్‌ తిరగరాశాడు. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 32.2 ఓవర్లలో 112 పరుగులకు కుప్పకూలింది. ప్రిటోరియస్‌ 5 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... రబడ, పార్నెల్, ఫెలుక్‌వాయోలకు రెండేసి వికెట్లు లభించాయి.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా