కివీస్‌ను గెలిపించిన డివైన్‌ 

23 Feb, 2020 02:52 IST|Sakshi

శ్రీలంకపై 7 వికెట్లతో విజయం

టి20 మహిళల ప్రపంచ కప్‌  

పెర్త్‌: కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (55 బంతుల్లో 75 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. శనివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో కివీస్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ముందుగా లంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కెప్టెన్‌ చమరి అటపట్టు (41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, జెన్సెన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం న్యూజిలాండ్‌ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు సాధించింది. కెప్టెన్‌కు తోడుగా మ్యాడీ గ్రీన్‌ (20 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 37 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు.  డివైన్‌ 46 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ టి20ల్లో డివైన్‌ వరుసగా ఆరో మ్యాచ్‌లో కనీసం అర్ధసెంచరీ సాధించడం విశేషం.

విండీస్‌ చేతిలో థాయ్‌లాండ్‌ ఓటమి... 
తొలిసారి ప్రపంచకప్‌ బరిలోకి దిగిన థాయ్‌లాండ్‌కు మొదటి మ్యాచ్‌లో చుక్కెదురైంది. కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ (3/13, 37 బంతుల్లో 26 నాటౌట్‌; 3 ఫోర్లు) ఆల్‌రౌండ్‌ ప్రదర్శతో వెస్టిండీస్‌ 7 వికెట్ల తేడాతో థాయ్‌లాండ్‌ను ఓడించింది. ముందుగా థాయ్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 78 పరుగులే చేయగలిగింది. అనంతరం విండీస్‌ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 80 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు