ఉత్కంఠ పోరులో కివీస్‌దే విజయం

23 Jun, 2019 03:49 IST|Sakshi
కాట్రెల్‌, విలియమ్సన్‌

విలియమ్సన్‌ అద్భుత సెంచరీ

న్యూజిలాండ్‌ను గట్టెక్కించిన కెప్టెన్‌

అండగా నిలిచిన టేలర్‌

బ్రాత్‌వైట్‌ సూపర్‌ సెంచరీ

మాంచెస్టర్‌: చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ వెస్టిండీస్‌పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో మరోసారి అగ్రస్థానానికి చేరింది. టాస్‌ గెలిచి వెస్టిండీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కివీస్‌ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తలిలింది. ఇన్నింగ్స్‌ తొలిబంతికే గప్టిల్‌ (0)ను ఔట్‌ చేసిన కాట్రెల్‌ ఐదో బంతికి మున్రో (0)ను బౌల్డ్‌ చేశాడు. రెండో బంతికే క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌... టేలర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. విలియమ్సన్‌ (154 బంతుల్లో 148; 14 ఫోర్లు, 1 సిక్స్‌) వీరోచిత శతకానికి తోడు... టేలర్‌ (95 బంతుల్లో 69; 7 ఫోర్లు) రాణించడంతో న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్‌ కాట్రెల్‌కు 4 వికెట్లు దక్కాయి. 

అనూహ్యంగా మ్యాచ్‌ అటూ ఇటూ..!
292 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ కుప్పకూలింది. 49 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ (87), సెకండ్‌ డౌన్‌ బ్యాట్స్‌మన్‌ హెట్‌మైర్‌ (54) రాణించారు. మూడో వికెట్‌కు 122 పరుగులు జోడించారు. ఓ దశలో 27 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసిన వెస్టిండీస్‌ను మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ 101 (82 బంతులు, 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. చివరి వికెట్‌కు 7 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేయాలి. అయితే, 49వ ఓవర్‌ చివరి బంతిని భారీ సిక్సర్‌గా మలిచి జట్టుకు అనూహ్య విజయాన్నందించాలనుకున్న అతని ఆశ నెరవేరలేదు. నీషమ్‌ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి అతను భారంగా పెలివిలియన్‌ చేరాడు. దీంతో విండీస్‌ కథ ముగిసింది. ఓటమి ఖాయమనుకున్న దశ నుంచి గెలుపు దిశగా వెస్టిండీస్‌ పయనించడం.. చివర్లో ఓటమి పాలవడం స్టేడియంలో ఉన్న ప్రతిఒక్కరినీ బాధింపజేసింది. ముఖ్యంగా బ్రాత్‌వైట్‌ పోరాట పటిమకు అందరూ ముగ్ధులయ్యారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు

ఇంగ్లాండ్‌ అలా గెలిచిందట.!

సారీ న్యూజిలాండ్‌...

లార్డ్స్‌ నుంచి లార్డ్స్‌ వరకు...

ప్రపంచ కల నెరవేరింది

ప్రపంచకప్‌ 2019: పుట్టినింటికే చేరింది

మ్యాట్‌ హెన్రీ అరుదైన ఘనత

ఇంగ్లండ్‌ ఛేదిస్తుందా.. చతికిలబడుతుందా?

కేన్‌ విలియమ్సన్‌ వరల్డ్‌ రికార్డు

ఇంకా ధోని గురించి ఎందుకు?

ఫైనల్‌ అప్‌డేట్స్‌: విశ్వవిజేతగా ఇంగ్లండ్‌