విజేత కిరియోస్‌

4 Mar, 2019 01:22 IST|Sakshi

అకాపుల్కో (మెక్సికో): వివాదాస్పద ఆస్ట్రేలియా టెన్నిస్‌ ప్లేయర్‌ నిక్‌ కిరియోస్‌ ఈ ఏడాది తొలి టైటిల్‌ సాధించాడు. మెక్సికో ఓపెన్‌లో అతను విజేతగా అవతరించాడు. ఫైనల్లో కిరియోస్‌ 6–3, 6–4తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై విజయం సాధించి కెరీర్‌లో ఐదో సింగిల్స్‌ టైటిల్‌ను దక్కించుకున్నాడు. విజేతగా నిలిచిన కిరియోస్‌కు 3,67,630 డాలర్ల (రూ. 2 కోట్ల 61 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 72వ స్థానంలో ఉన్న కిరియోస్‌ ఈ టోర్నీలో పలు సంచలన విజయాలు నమోదు చేశాడు. రెండో రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)పై మూడు మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకొని నెగ్గగా... క్వార్టర్‌ ఫైనల్లో మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత స్టానిస్లాస్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌)ను... సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ జాన్‌ ఇస్నెర్‌ (అమెరికా)ను ఓడించి ఫైనల్‌కు చేరాడు. 

మరిన్ని వార్తలు