ఆ షూస్‌ ధర రూ. 3 కోట్లు!

24 Jul, 2019 16:14 IST|Sakshi

రికార్డు ధర పలికిన నైక్‌ ‘మూన్‌ షూ’ 

నైక్ షూ కంపెనీ చరిత్రలో అతి పెద్ద రికార్డు నమోదయింది. 1972 సంవత్సరంలో తయారు చేసిన ఒక జత బూట్లను వేలం వేయగా.. అవి రూ. 3 కోట్లకు పైగా ధర పలికాయి. వేలంలో రికార్డు సృష్టించిన ఈ బూట్లను 'మూన్ షూ' పేరిట 1972లో ఒలింపిక్ ట్రయల్స్‌లో రన్నర్లు ధరించడానికి రూపొందించారు. 12 జతలు మాత్రమే తయారు చేసిన ఈ బూట్లలో మొట్టమొదటి జతను మైల్స్‌ నాదల్‌ అనే వ్యక్తికి  అమ్మారు. కెనడాలోని టొరంటోకు చెందిన ఆయనకు ఒక మ్యూజియం ఉండేది. ఈ మ్యూజియంలో కార్ల సేకరణతో పాటు బూట్లను సైతం ప్రదర్శించాలని అభిరుచి ఉండేది.  ఈ క్రమంలో  'మూన్ షూస్'ను కొనడానికి ఒక వారం ముందు సోథెబైస్ అనే ఆన్‌లైన్‌ నిర్వహించిన వేలంలో 99 ఇతర జతల బూట్లు కూడా కొన్నాడు. వీటన్నింటికి కలిపి కోటి పది లక్షల రూపాయలు వెచ్చించాడు.

ఇక మూన్‌ షూ రికార్డు వేలం పట్ల  మైల్స్‌ నాదల్‌ స్పందిస్తూ.. ‘ఇప్పటివరకు తయారు చేయబడిన  అరుదైన జత స్నీకర్లలో  ఐకానిక్ షూ నైక్ 'మూన్ షూస్' అని క్రీడా చరిత్ర , పాప్ సంస్కృతిలో సరికొత్త చరిత్ర సృష్టింది’ అని  ఆనందం వ్యక్తం చేశాడు. తాను ప్రారంభంలో కొనుగోలు చేసిన  99  జతల బూట్ల పట్ల తనకు సంతృప్తి ఇవ్వలేదన్నాడు. మూన్‌ షూకు ఇంత ధర పలకడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు