నిఖత్, ప్రసాద్‌లకు కాంస్యాలు

24 May, 2019 00:49 IST|Sakshi

గువాహటి: ఇండియా ఓపెన్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్‌ పొలిపల్లి లలితా ప్రసాద్‌ (పురుషుల 52 కేజీలు), తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ (మహిళల 51 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ 4–1తో నిఖత్‌ను ఓడించగా... లలితా ప్రసాద్‌ 0–5తో ఆసియా చాంపియన్‌ అమిత్‌ పంఘల్‌ (భారత్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఓవరాల్‌గా పురుషుల విభాగంలో 31 పతకాలు... మహిళల విభాగంలో 26 పతకాలు భారత్‌కు ఖాయమయ్యాయి. పురుషుల 52 కేజీల విభాగం ఫైనల్లో అమిత్‌తో భారత్‌కే చెందిన సచిన్‌ సివాచ్‌ తలపడతాడు. సెమీస్‌లో సచిన్‌ 5–0తో గౌరవ్‌ సోలంకిపై గెలిచాడు. పురుషుల 60 కేజీల విభాగంలో వరుసగా నాలుగు ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన శివ థాపా (భారత్‌), మనీశ్‌ కౌశిక్‌ (భారత్‌) స్వర్ణ పతక పోరుకు సిద్ధమయ్యారు.

సెమీఫైనల్స్‌లో శివ థాపా 5–0తో క్రిస్టియన్‌ జెపాన్‌స్కీ (పోలాండ్‌)పై, మనీశ్‌ 5–0తో అంకిత్‌ (భారత్‌)పై విజయం సాధించారు. పురుషుల 49 కేజీల విభాగంలోనూ ఇద్దరు భారత బాక్సర్లు దీపక్, గోవింద్‌ కుమార్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీస్‌లో కరోలో పాలమ్‌ (ఫిలిప్పీన్స్‌) నుంచి దీపక్‌కు వాకోవర్‌ లభించగా... తషీ వాంగ్డి (భూటాన్‌)పై గోవింద్‌ నెగ్గాడు. 56 కేజీల విభాగం సెమీఫైనల్స్‌లో కవిందర్‌ బిష్త్‌ 4–1తో మదన్‌ లాల్‌ (భారత్‌)పై, చాట్‌చాయ్‌ డెచా (థాయ్‌లాండ్‌) 5–0తో గౌరవ్‌ బిధురి (భారత్‌) పై విజయం సాధించారు. భారత్‌కే చెందిన రోహిత్‌ (64 కేజీలు), ఆశిష్‌ (69 కేజీలు), దుర్యోధన్‌ సింగ్‌ (69 కేజీలు), ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు), బ్రిజేశ్, మనీశ్‌ పవార్‌ (81 కేజీలు) ఫైనల్‌కు చేరారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంగ్లండ్‌కు సవాల్‌

మనకూ తగిలింది వరుణుడి దెబ్బ

బ్యాడ్మింటన్‌కు లీ చాంగ్‌ గుడ్‌బై

‘టాస్‌ గెలిచి స్విమ్మింగ్‌ ఎంచుకున్న భారత్‌’

ఈ వానేదో అక్కడ పడొచ్చు కదా: జాదవ్‌

భారత్‌-కివీస్‌ మ్యాచ్‌కు తప్పని వరుణుడి ముప్పు

‘ఎంత మంచి వాడవయ్య వార్నర్‌’

ఫైనల్‌లో తలపడేవి ఆ జట్లే..!!

‘షెల్డన్‌ సెల్యూట్‌’పై కోచ్‌ అసహనం..!

నన్ను ఇబ్బంది పెట్టింది వారే: యువీ

భారత్‌-కివీస్‌ మ్యాచ్‌కు వర్షం ఆటంకం

‘వరల్డ్‌కప్‌ నా చేతుల్లో ఉండాలనుకుంటున్నా’

బాస్కెట్‌బాల్‌ జాతీయ శిబిరానికి కార్తీక్‌

ఎందుకీ మతిలేని ప్రకటనలు: సానియా

కోహ్లిని ఊరిస్తున్న భారీ రికార్డు

‘రిజర్వ్‌ డే’ సాధ్యం కాదు

భారత పురుషుల ఆర్చరీ జట్టుకు ‘టోక్యో’ బెర్త్‌

‘రెక్కలతో కాదు... సంకల్పంతో ఎగురుతా’

పంత్‌ ఇంగ్లండ్‌ పయనం

పాక్‌ తొడగొట్టినా... ఆసీస్‌ పడగొట్టింది

భారత్‌కు బలపరీక్ష

ప్రపంచకప్‌: పాక్‌ చేజేతులా..

ఆదాయం పెరిగింది.. ర్యాంకు తగ్గింది!

ఆ ప్రకటనలపై సానియా ఫైర్‌

‘పంత్‌ వద్దు.. రహానే బెటర్‌’

అలా చేయడంకంటే ఇంటికి వెళ్లడమే బెటర్‌..!

ఇంగ్లండ్‌కు పయనమైన పంత్‌

శతక్కొట్టిన వార్నర్.. పాక్‌ లక్ష్యం 308

సినిమాకు భారత్‌ క్రికెటర్లు.. ఫ్యాన్స్‌ ఫైర్‌

పాక్‌తో మ్యాచ్‌: ఆసీస్‌ ఓపెనర్ల అరుదైన ఘనత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యూత్‌కి థ్రిల్‌

ఆగస్ట్‌లో గుమ్మడికాయ

కలల తీరం

చెన్నైకి వణక్కం

ఫ్యాన్‌ మూమెంట్‌

కంటిని నమ్మొద్దు