ఇండియా ఓపెన్‌ బాక్సింగ్‌ టోర్నీకి నిఖత్, హుసాముద్దీన్, ప్రసాద్‌ 

14 May, 2019 00:20 IST|Sakshi

న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగే ఇండియా ఓపెన్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ బాక్సర్లు నిఖత్‌ జరీన్, మొహమ్మద్‌ హుసాముద్దీన్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొలిపల్లి లలితా ప్రసాద్‌ ఎంపికయ్యారు. మే 20 నుంచి 24 వరకు గువాహటిలో ఈ టోర్నీ జరుగుతుంది. ఒలింపిక్‌ కేటగిరీ అయిన 51 కేజీల విభాగంలో నిఖత్‌ బరిలోకి దిగుతుంది. ఇదే విభాగంలో భారత మేటి బాక్సర్‌ మేరీకోమ్‌ కూడా పాల్గొంటుంది. హుసాముద్దీన్‌ 54 కేజీల విభాగంలో, ప్రసాద్‌ 52 కేజీల విభాగంలో ఉన్నారు. 70 వేల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో భారత్‌ తరఫున పురుషుల విభాగంలో 35 మంది... మహిళల విభాగంలో 37 మంది పోటీపడతారు. ఈ టోర్నీలో 16 దేశాల నుంచి సుమారు 200 మంది బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. 
 

మరిన్ని వార్తలు