నిఖత్, హుసాముద్దీన్‌లకు రజతాలు

28 Jul, 2019 05:03 IST|Sakshi

ఫెనల్లో ఓడిన తెలంగాణ బాక్సర్లు

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత్‌కు ఎనిమిది పతకాలు

బ్యాంకాక్‌: ఈ ఏడాది మరో అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. శనివారం ముగిసిన థాయ్‌లాండ్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు స్వర్ణం, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు లభించాయి. 37 దేశాల నుంచి పలువురు మేటి బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్లు నిఖత్‌ జరీన్‌ (మహిళల 51 కేజీలు), మొహమ్మద్‌ హుసాముద్దీన్‌ (పురుషుల 56 కేజీలు) రజత పతకాలతో సంతృప్తి పడ్డారు. భారత్‌కే చెందిన దీపక్‌ సింగ్‌ (48 కేజీలు), బ్రిజేశ్‌ యాదవ్‌ (81 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు) పసిడి పతకంతో అదరగొట్టాడు.

సెమీఫైనల్లో ఓడిన మంజు రాణి (48 కేజీలు), ఆశిష్‌ (69 కేజీలు), భాగ్యబతి కచారి (75 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిన్‌లాండ్‌లో జరిగిన ‘గీ–బీ’ టోర్నీలో, పోలాండ్‌లో జరిగిన ఫెలిక్స్‌ స్టామ్‌ టోర్నీలో రజత పతకాలు నెగ్గిన హుసాముద్దీన్‌ మూడోసారీ రజతంతో సరిపెట్టుకున్నాడు. చట్‌చాయ్‌ డెచా బుత్‌దీ (థాయ్‌లాండ్‌)తో జరిగిన ఫైనల్లో హుసాముద్దీన్‌ 0–5తో ఓడిపోయాడు. ఇతర ఫైనల్స్‌లో దీపక్‌ సింగ్‌ 0–5తో మిర్జాఖెమెదోవ్‌ నోదిర్‌జోన్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో... బ్రిజేశ్‌ యాదవ్‌ 1–4తో అనావత్‌ థోంగ్‌క్రాటోక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్‌ జరీన్‌ 0–5తో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత చాంగ్‌ యువాన్‌ (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. 75 కేజీల ఫైనల్లో ఆశిష్‌ 5–0తో కిమ్‌ జిన్‌జే (కొరియా)పై నెగ్గి పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు.

తొమ్మిది స్వర్ణాలపై గురి...
ఇండోనేసియాలో జరుగుతున్న ప్రెసిడెంట్స్‌ కప్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో తొమ్మిది విభాగాల్లో భారత బాక్సర్లు ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల విభాగంలో దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ (51 కేజీలు), జమున (54 కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (60 కేజీలు), మోనిక (48 కేజీలు)... పురుషుల విభాగంలో గౌరవ్‌ బిధురి (56 కేజీలు), అనంత ప్రహ్లాద్‌ (52 కేజీలు), దినేశ్‌ డాగర్‌ (69 కేజీలు), అంకుశ్‌ (64 కేజీలు), నీరజ్‌ స్వామి (49 కేజీలు) నేడు స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గెలుపు ముంగిట బోర్లా పడిన బెంగాల్‌

పుణెరీని బోల్తా కొట్టించిన యు ముంబా

ఆ విషయంలో ధర్మసేనది తప్పులేదు : ఐసీసీ

బీసీసీఐ ప్రతిపాదనకు సీనియర్‌ క్రికెటర్‌ నో? 

టీమిండియాలో ప్రక్షాళన జరగాల్సిందే : మాజీ క్రికెటర్‌

స్టోక్స్‌కు ప్రమోషన్‌.. ఆర్చర్‌ అరంగేట్రం

లార్డ్స్‌ పిచ్‌పై రూట్‌ గరంగరం!

‘పెయిన్‌ కిల్లర్స్‌తోనే ప్రపంచకప్‌ ఆడాను’

మీలాంటి వాళ్లను క్రికెట్‌ ఆడకుండా చేసేవాడ్ని!

ఆమిర్‌ తొందరపడ్డాడు : వసీం అక్రం

రవిశాస్త్రి వైపే మొగ్గు?

'అస్సామి దాల్‌ వండడంలో తాను స్పెషలిస్ట్‌'

నదీమ్‌కు 10 వికెట్లు!

ఆసీస్‌ యాషెస్‌ జట్టు ఇదే..

భారత్‌ పోరాటం ముగిసింది..

మహ్మద్‌ షమీకి యూఎస్‌ వీసా నిరాకరణ

‘మ్యాచ్‌ విన్నర్లలో అతనిదే టాప్‌ ప్లేస్‌’

కాకినాడ కుర్రాడు వెస్టిండీస్‌ టూర్‌కు

బంగర్‌కు ఉద్వాసన..భరత్‌కు భరోసా!

చాంపియన్‌ ఆర్మీ గ్రీన్‌ జట్టు

బేస్‌బాల్‌ క్యాంప్‌నకు మనోళ్లు ముగ్గురు

అయ్యో... ఐర్లాండ్‌

టైటాన్స్‌ తెలుగు నేలపై చేతులెత్తేసింది..!

సింధు ఔట్‌.. సెమీస్‌లో ప్రణీత్‌

మలింగకు ఘనంగా వీడ్కోలు

ఫైనల్లో నిఖత్, హుసాముద్దీన్‌

ఆఖరి వన్డేలోనూ అదుర్స్‌

టైటాన్స్‌ది అదే కథ.. అదే వ్యథ

యూపీ యోధ మరోసారి చిత్తుచిత్తుగా..

ఐర్లాండ్‌ ఇంత దారుణమా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దైవ రహస్యం

సరికొత్త కథతో...

ఇల్లు ఖాళీ చేశారు

మంచి నటుడు అనిపించుకోవాలనుంది

త్వరలోనే డబుల్‌ ఇస్మార్ట్‌ స్టార్ట్‌

భారీ అయినా సారీ!