ఫైనల్లో నిఖత్

29 Sep, 2013 02:36 IST|Sakshi
ఫైనల్లో నిఖత్

న్యూఢిల్లీ: తన పంచ్ పవర్ కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 17 ఏళ్ల ఈ నిజామాబాద్ అమ్మాయి 54 కేజీ విభాగంలో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది.
 
  బల్గేరియాలోని అల్బెనా నగరంలో జరుగుతున్న ఈ పోటీల్లో నిఖత్ 54 కేజీల సెమీఫైనల్లో 2011 జూనియర్ వరల్డ్ చాంపియన్ విక్టోరియా విర్ట్ (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. ఫైనల్లో యూంజీ యువాన్ (చైనా)తో నిఖత్ పోటీపడుతుంది. 2011 జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫ్లయ్ వెయిట్ కేటగిరీలో స్వర్ణ పతకం గెల్చుకున్న నిఖత్ ఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తానని తెలిపింది. మరోవైపు 60 కేజీల విభాగంలో సిమ్రాన్‌జిత్ కౌర్... జూనియర్ విభాగంలోని 48 కేజీల కేటగిరీలో ఆశా రోకా సెమీఫైనల్లో ఓటమిపాలై కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.
 
 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega