నిఖత్‌ శుభారంభం స్ట్రాండ్‌జా స్మారక బాక్సింగ్‌ టోర్నీ

22 Jan, 2020 03:46 IST|Sakshi

న్యూఢిల్లీ: స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. బల్గేరియా రాజధాని సోఫియాలో జరుగుతున్న ఈ టోరీ్నలో మహిళల 51 కేజీల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ 5–0తో యాస్మీన్‌ ముతాకి (మొరాకో)పై ఘనవిజయం సాధించింది. ఇదే టోర్నీలో పురుషుల 63 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ శివ థాపాకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. మరోవైపు సెర్బియాలో ముగిసిన నేషన్స్‌ కప్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోరీ్నలో భారత్‌కు నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు లభించాయి. మీనా కుమారి (54 కేజీలు), రితూ గ్రెవాల్‌ (51 కేజీలు), మోనిక (48 కేజీలు), భాగ్యబతి (75 కేజీలు) ఫైనల్లో ఓడి రజతాలు నెగ్గగా... సెమీస్‌లో ఓడిన బసుమతారి (64 కేజీలు), పవిత్ర (60 కేజీలు) కాంస్యాలు సాధించారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలానికి బట్లర్‌ ప్రపంచకప్‌ జెర్సీ

హాకీ ఇండియా, ఏఐఎఫ్‌ఎఫ్‌ విరాళం రూ. 25 లక్షలు

కుదించి... మనవాళ్లతోనే ఆడించాలి

రెండో ర్యాంక్‌లో రెజ్లర్‌ బజరంగ్‌

వింబుల్డన్‌ టోర్నమెంట్‌ రద్దు

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా