నిఖత్‌కు పతకం ఖాయం

30 Oct, 2019 03:33 IST|Sakshi

మరో ఆరుగురు భారత బాక్సర్లకు కూడా

టోక్యో ఒలింపిక్స్‌ టెస్ట్‌ ఈవెంట్‌

టోక్యో: రింగ్‌లోకి అడుగు పెట్టకుండానే ఆరుగురు భారత బాక్సర్లకు... క్వార్టర్‌ ఫైనల్లో విజయంతో మరో భారత బాక్సర్‌కు టోక్యో ఒలింపిక్స్‌ బాక్సింగ్‌ టెస్ట్‌ ఈవెంట్‌లో పతకాలు ఖాయమయ్యాయి. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల 63 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో శివ థాపా 5–0తో యుకీ హిరకావ (జపాన్‌)పై గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. తక్కువ ఎంట్రీల కారణంగా మరో ఆరుగురు భారత బాక్సర్లకు నేరుగా సెమీఫైనల్లో చోటు లభించడంతో వారి ఖాతాలో పతకాలు చేరనున్నాయి. మహిళల విభాగంలో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ (51 కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (60 కేజీలు), పూజా రాణి (75 కేజీలు)... పురుషుల విభాగంలో సుమీత్‌ సాంగ్వాన్‌ (91 కేజీలు), ఆశిష్‌ (69 కేజీలు), వన్‌హిలిమ్‌పుయా (75 కేజీలు) నేరుగా సెమీఫైనల్‌ బౌట్‌లు ఆడనున్నారు.

మరిన్ని వార్తలు