క్వార్టర్స్‌లో నిక్కీ, భువన, సౌజన్య

3 Oct, 2019 09:48 IST|Sakshi

ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు, టాప్‌ సీడ్‌ నిక్కీ పునాచ, తెలంగాణ అమ్మాయి భువన కాల్వ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో పురుషులు, మహిళల విభాగంలో వీరిద్దరితో పాటు రాష్ట్రానికి చెందిన ఇతర ప్లేయర్లు సౌజన్య భవిశెట్టి, శ్రేయ తటవర్తి, శ్రావ్యశివాని క్వార్టర్స్‌కు చేరుకోగా... రష్మిక భమిడిపాటి, సాయి దేదీప్య ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ నిక్కీ 6–4, 6–2తో కేఎస్‌ ధీరజ్‌పై గెలుపొందాడు.

మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ సౌజన్య 6–0, 6–3తో తేజస్వీ (మహారాష్ట్ర)పై, శ్రేయ తటవర్తి 6–2, 6–4తో సాయిదేదీప్యపై, భువన 6–2, 7–6 (7/3)తో వన్షిత (కర్ణాటక)పై, శ్రావ్య శివాని 6–1, 4–6, 6–3తో అకాంక్ష నిట్టూరే (మహారాష్ట్ర)పై గెలుపొందారు. మరో మ్యాచ్‌లో రష్మిక భమిడిపాటి 6–2, 2–6, 3–6తో జగ్‌మీత్‌ కౌర్‌ (పంజాబ్‌) చేతిలో ఓడిపోయింది. అండర్‌–18 విభాగంలో తెలంగాణ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బాలికల కేటగిరీలో రషి్మక భమిడిపాటి క్వార్టర్స్‌లో అడుగుపెట్టగా... సంస్కృతి దామెర, సంజన సిరిమల్ల పరాజయం పాలయ్యారు. బాలికల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ రషి్మక 7–5, 6–2తో పదో సీడ్‌ సంజన సిరిమల్లపై గెలుపొందగా... సంస్కృతి 1–6, 1–6తో ప్రేరణ విచారే చేతిలో ఓడిపోయింది.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌: ఇక్బాల్‌ 4–6, 6–3, 6–0తో విజయంత్‌ మాలిక్‌పై, కునాల్‌ ఆనంద్‌ 6–7 (4/7), 7–5, 6–4తో చంద్రిల్‌ సూద్‌పై, ఆర్యన్‌ 6–4, 0–6, 7–6 (7/2)తో అని్వత్‌ బింద్రేపై, సూరజ్‌ 6–3, 3–6, 6–4తో జతిన్‌పై, దలీ్వందర్‌ సింగ్‌ 6–4, 6–2తో పరాస్‌పై, ప్రజ్వల్‌ దేవ్‌ 3–6, 7–6 (7/2), 6–1తో సురేశ్‌పై, నితిన్‌ సిన్హా 7–6 (7/2), 6–3తో అభినవ్‌ సంజీవ్‌పై గెలుపొందారు.  

మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌: ప్రేరణ బాంబ్రీ 6–4, 6–1తో ఆర్తిపై, వైదేహి చౌదరీ 6–0, 6–3తో లక్షి్మపై నెగ్గారు.  
అండర్‌–18 బాలికల ప్రిక్వార్టర్స్‌: కశిష్‌ భాటియా 6–1, 6–3తో భక్తి షా (తెలంగాణ)పై, ఆకాంక్ష 6–0, 6–0తో పవిత్రపై, పూజ 6–4, 6–3తో సారా దేవ్‌పై, సందీప్తి సింగ్‌ 6–4, 6–4తో జగ్‌మీత్‌ కౌర్‌పై, రేష్మ 6–2, 6–0తో గార్గి పవార్‌పై, బేలా 3–6, 7–5, 6–3తో వన్షిక చౌదరీపై విజయం సాధించారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా