నిర్మల ‘మీట్‌’ రికార్డు

5 Jun, 2017 00:52 IST|Sakshi
నిర్మల ‘మీట్‌’ రికార్డు

పాటియాలా: హరియాణా అమ్మాయి నిర్మల ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో 400 మీటర్ల రేసులో స్వర్ణం సాధించింది. ఆమె 51.28 సెకన్లలో పరుగు పూర్తిచేసి కొత్త మీట్‌ రికార్డు నెలకొల్పింది.

ప్రపంచ చాంపియన్‌షిప్‌ అర్హత ప్రమాణాన్ని (52.50 సెకన్లు) కూడా అధిగమించిన నిర్మల ఆగస్టులో లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌ బెర్త్‌ను దక్కించుకుంది.  జావెలిన్‌ త్రోయర్‌ అనురాణి కూడా ‘లండన్‌’కు అర్హత పొందింది. ఆమె జావెలిన్‌ను 61.86 మీటర్ల దూరం విసిరి జాతీయ రికార్డు సృష్టించింది.

మరిన్ని వార్తలు