క్లీన్‌స్వీప్ చేసినా భారత్ ర్యాంకు అంతే!

21 Feb, 2018 19:29 IST|Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌: ఓటమనేది లేకుండా ముక్కోణపు ట్వంటీ 20 సిరీస్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. మరోవైపు ఐసీసీ టీ20 తాజా ర్యాంకింగ్స్‌లోనూ ఆసీస్, టీమిండియాను వెనక్కి నెట్టేసింది. దాదాపు పదిహేను పాయింట్లు మెరుగు పరుచుకున్న ఆసీస్ రెండో స్థానంలో నిలవగా, భారత్ మూడో స్థానానికి పరిమితమైంది. పాకిస్తాన్ 126 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానం సొంతం చేసుకోగా, అదే రేటింగ్ పాయింట్లున్న ఆసీస్ ఓవరాల్ పాయింట్లలో వ్యత్యాసంతో రెండో స్థానంలో ఉండగా, 122 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో ఉంది.

ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల మధ్య టీ20 ట్రై సిరీస్‌ నిర్వహించగా, కివీస్, ఆసీస్‌లు ఫైనల్ చేరాయి. కాగా నేడు జరిగిన ఫైనల్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో కివీస్‌పై ఆసీస్ నెగ్గిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న విరాట్ కోహ్లి సేన తొలి టీ20లో నెగ్గగా, నేడు రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్విప్ చేసినా భారత్ ర్యాంకుల్లో మాత్రం ఏ మార్పు ఉండదు.

నేడు సెంచూరియన్‌ వేదికగా సూపర్‌ స్పోర్ట్స్‌ పార్క్‌ మైదానంలో రాత్రి 9.45 గంటలకు రెండో టీ20 ప్రారంభం కానుంది. కాగా, వర్షం కారణంగా ఇదివరకే ఈ మైదానంలో భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న నాలుగో టీ20కి అంతరాయం ఏర్పడ్డ విషయం తెలిసిందే.

  
 

మరిన్ని వార్తలు