వికెట్‌ కీపర్‌గా గిల్‌క్రిస్ట్‌.. ధోనికి నో చాన్స్‌!

30 May, 2020 14:46 IST|Sakshi
గిల్‌క్రిస్ట్‌(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ: ఈ సీజన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)పై కమ్ముకున్న ‘కరోనా నీడలు’ ఇంకా అలానే ఉన్నాయి. 13వ ఐపీఎల్‌ జరుగుతుందని కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గితే ఈ లీగ్‌ను సెప్టెంబర్‌-అక్టోబర్‌లో జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ అలా జరగాలంటే టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడాల్సి ఉంటుంది. దాంతో ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యమా.. కాదా అనేది నిర్వహకులే తేల్చుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంచితే, లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ప్రస్తుత క్రికెటర్లు, మాజీలు తమ అత్యుత్తమ జట్లను ప్రకటిస్తున్నారు. 

దీనిలో భాగంగా దక్షిణాఫ్రికా సీనియర్‌ క్రికెటర్‌ జేపీ డుమినీ తన ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ జట్టును ఎంపిక చేశాడు. ఇందులో ఇద్దరు భారత క్రికెటర్లకు చోటు కల్పించిన డుమినీ.. ఐపీఎల్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్‌ ధోనికి చాన్స్‌ ఇవ్వలేదు. వికెట్ కీపర్‌గా ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌కు అవకాశం ఇచ్చిన డుమినీ.. ధోనిని ఎంపిక చేయలేదు. కాగా, తన ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ జట్టుకు విరాట్‌ కోహ్లిని కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. అదే సమయంలో భారత్‌ నుంచి రోహిత్‌ శర్మకు అవకాశం ఇచ్చాడు. 

డుమినీ ఆల్‌టైమ్‌ జట్టు ఇదే.. 
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, రోహిత్‌శర్మ, ఏబీ డివిలియర్స్‌, కీరోన్‌ పొలార్డ్‌, రసెల్‌, బ్రెట్‌ లీ, ముత్తయ్య మురళీ ధరన్‌, లసిత్‌ మలింగా, ఇమ్రాన్‌ తాహీర్‌

మరిన్ని వార్తలు