ఏమీ తేల్చలేదు

20 Jul, 2015 00:12 IST|Sakshi
ఏమీ తేల్చలేదు

 లోధా తీర్పు అధ్యయనానికి
 వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు
  ఆరు వారాల్లో ప్రతిపాదనలు
   ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం

 ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి రెండు ప్రధాన జట్లపై వేటు పడిన నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి (జీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఉత్కంఠగా ఎదురుచూసినా ప్రస్తుతానికి ఎటూ తేల్చలేదు. ఆదివారం జరిగిన ఈ సమావేశంలో చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లను శాశ్వతంగా నిషేధిస్తారా? లేక బోర్డే తమ చేతుల్లోకి తీసుకుని నిర్వహిస్తుందా? అనే అనుమానాలకు సమాధానం దొరుకుతుందని అంతా భావించారు. అయితే ఈ వ్యవహారంపై జీసీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన తీర్పును పూర్తిగా అధ్యయనం చేసేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలో ఈ గ్రూప్ పనిచేస్తుంది. ఆరు వారాల్లోగా ఈ గ్రూప్ సభ్యులు తీర్పును చదివి ఐపీఎల్ పాలక మండలికి తగిన ప్రతిపాదనలతో కూడిన నివేదికను ఇస్తారని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు