‘టాస్‌ లేకపోవడమే మంచిది’

21 May, 2018 18:19 IST|Sakshi

కరాచీ: టెస్టు క్రికెట్‌లో టాస్‌ను తొలగించే అంశంపై ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఆలోచనలు చేస్తోంది.  ఆతిథ్య జట్లు పిచ్‌లను తమకు అనుకూలంగా తయారు చేసుకుంటున్న రీత్యా ఈ విధానానికి స్వస్తి పలకాలనే భావిస్తోంది. దీన్ని పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్‌ స్వాగతించాడు. టెస్టుల్లో టాస్‌ లేకుండా ఉండటం  వల్ల మంచి పిచ్‌లను రూపొందించడానికి ఆతిథ్య జట్లు కృషి చేస్తాయన్నాడు. దీనివల్ల లాభమే తప్పా నష్టమేమీ లేదని మియాందాద్‌ అభిప్రాయపడ్డాడు.

‘ఆతిథ్య జట్లు వారికి నచ్చిన తరహాలో పిచ్‌లను తయారు చేస్తున్నాయి. దీనివల్ల చాలా ఎక్కువ సందర్బాల్లో పేలవమైన పిచ్‌లను రూపొందిస్తున్నారు. ఒకవేళ టెస్టుల్లో టాస్‌ లేకపోతే అప్పుడు ఆతిథ్య మంచి పిచ్‌లను తయారు చేయడానికి వెనుకాడదు. ఈ ప్రయోగం మంచిదే’ అని మియాందాద్‌ తెలిపాడు.

టెస్టుల్లో టాస్‌ తొలగించే అంశంపై ఈ నెల 28, 29 తేదీల్లో ముంబైలో జరగనున్న సమావేశంలో కమిటీ చర్చించనుంది. అనిల్‌ కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్, ఆండ్రూ స్ట్రాస్, జయవర్ధనే, టిమ్‌ మే, న్యూజిలాండ్‌ క్రికెట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ వైట్, అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బరో, ఐసీసీ రిఫరీలు రంజన్‌ మదుగలే, షాన్‌ పొలాక్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2021లో తలపెట్టిన ప్రతిపాదిత టెస్టు చాంపియన్‌షిప్‌ నాటికి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లిష్‌ కౌంటీల్లో మూడు సీజన్లుగా టాస్‌ లేకుండా... బ్యాటింగ్, బౌలింగ్‌ ఎంపికను పర్యాటక జట్టుకే వదిలేస్తున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లంకదే సిరీస్‌

గోవా ప్రభుత్వానికి ఐఓఏ హెచ్చరిక  

ప్రపంచ చాంపియన్‌షిప్‌కు వినేశ్‌ ఫొగాట్, సాక్షి 

దబంగ్‌ ఢిల్లీ హ్యాట్రిక్‌ 

సరే... అలాగే చేద్దాం

పసిడి కాంతలు 

హర్భజన్‌, ద్యుతీ చంద్‌ నామినేషన్లు తిరస్కరణ!

అవకాశాలు ఇస్తనే కదా.. సత్తా తెలిసేది

మేరీ కోమ్‌ మెరిసింది!

ప్రేమ జంట.. మధ్యలో యువీ!

చాలా నష్టం చేశాడు.. ఇంకా కోచ్‌గా ఎందుకు?

కోహ్లి కబడ్డీ జట్టు ఇదే..!

ఇంగ్లండ్‌కు ఆమిర్‌ మకాం!

సత్తా చాటుతున్న మన బా'క్సింగ్‌'లు

రోహిత్‌తో వివాదం.. కోహ్లి వస్తాడా..రాడా?

రవిశాస్త్రిపై సంచలన వ్యాఖ్యలు!

యువీ.. వాటే సిక్స్‌

మరోసారి ‘రికార్డు’ సెంచరీ

ఎంవీ శ్రీధర్‌పై పుస్తకం

టైటిల్‌కు మరింత చేరువలో ప్రీతి

ప్రత్యూషకు నాలుగో స్థానం

పోరాడి ఓడిన దివిజ్‌–ఎల్రిచ్‌ జంట

హామిల్టన్‌కు 87వ ‘పోల్‌’

షమీకి అమెరికా వీసా తిరస్కరణ, మంజూరు

జయహో... యు ముంబా

సెమీస్‌తో సరి

షూటింగ్‌ లేకుంటే... 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ను బహిష్కరిద్దాం

నిఖత్, హుసాముద్దీన్‌లకు రజతాలు

గెలుపు ముంగిట బోర్లా పడిన బెంగాల్‌

పుణెరీని బోల్తా కొట్టించిన యు ముంబా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

బిగ్‌బాస్‌.. హేమ ఎలిమినేటెడ్‌