'నా సక్సెస్ వెనుక సీక్రెట్స్ లేవు'

17 Oct, 2015 16:46 IST|Sakshi
'నా సక్సెస్ వెనుక సీక్రెట్స్ లేవు'

షాంఘై: తన సక్సెస్ వెనుక ఎటువంటి సీక్రెట్స్ లేవంటున్నాడు వరల్డ్ నంబర్ వన్ టెన్సిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్. షాంఘై రోలెక్స్ మాస్టర్స్ టోర్నీలో సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లిన జొకోవిచ్..  ప్రత్యర్థి ఆటతీరును అంచనావేస్తూనే తాను ఫీల్డ్ లో ఆటను కొనసాగిస్తానన్నాడు. 'మన ప్రత్యర్థి ఎలా ఆడుతున్నాడు.. నువ్వు ఎలా ఆడుతున్నావు అనే అంశాలను బేరీజు వేసుకుంటూ ఆడతా. అదే తన గెలుపుకు సహకరిస్తుంది. అంతేకాని ఎటువంటి సీక్రెట్స్ లేవు' అని స్పష్టం చేశాడు.

 

అయితే అన్నిసార్లు విజయం మన అంచనాల్లో మాత్రం ఉండదన్నాడు. గత కొంతకాలం నుంచి తాను ఆశించిన స్థాయిలో రాణిస్తున్నందున ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతూ వస్తుందన్నాడు. ప్రత్యర్థి ఎవరైనా కోర్టులో తనదైన శైలిలో ఆటను కొనసాగిస్తానన్నాడు. శనివారం జరిగే సెమీ ఫైనల్లో మూడో సీడ్ ఆండ్రీ ముర్రేతో జొకోవిచ్ తలపడనున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ లను తన ఖాతాలో వేసుకున్న జొకొవిచ్ మొత్తంగా 10 గ్రాండ్ స్లామ్ లను సాధించి మంచి ఊపుమీద ఉన్నాడు. షాంఘై రోలెక్స్ మాస్టర్స్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ రోజర్స్ ఫెదరర్ తొలి రౌండ్ లోనే ఇంటి ముఖం పట్టిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు