కుర్రాళ్లు వెలుగులోకి వచ్చే మార్గమేది?

18 Dec, 2019 14:00 IST|Sakshi

జూనియర్లకు స్పాన్సర్‌షిప్‌ కష్టాలు

టెన్నిస్‌ స్టార్‌ సాకేత్‌ మైనేని వ్యాఖ్య  

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌లో కొత్తగా కుర్రాళ్లు వెలుగులోకి వచ్చే మార్గమే లేదని తెలుగుతేజం సాకేత్‌ మైనేని అన్నాడు. దేశంలో ఇప్పటివరకూ యువ టెన్నిస్‌ ఆటగాళ్లు రాణించేందుకు అవసరమైన ప్రాథమిక చర్యలే  లేవన్నాడు. ఓ వార్తాసంస్థకిచి్చన ఇంటర్వ్యూ లో భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడైన సాకేత్‌ నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశాడు. ‘ఎప్పటి నుంచో ఎంతో మంది ఎన్నోసార్లు అది చేస్తాం, ఇది చేస్తామన్నారు... కానీ ఆచరణలో అవేవీ చూడలేదు ఇప్పటివరకు! క్రీడావర్గాలకు అసలు ఆటగాళ్లు ఎలా తయారవుతారన్న ఆలోచనే లేదు.

నిజానికి ఇదంతా ఓ నిర్ణీత కాలచక్రంగా ఓ పద్ధతి ప్రకారం జరగాలి కానీ... ఇక్కడ అలా లేదు. ఆటగాళ్లంతా తమ సొంతంగా ఎదగడమే తప్ప... క్రీడా సంఘాలు, ఆ శాఖ చేసేది కూడా ఏమీ ఉండదు. ఒక్కోక్కరిది ఒక్కోకథ. అందరివీ కష్టంతో కూడుకున్నవే! ఏ ఒక్కరూ నల్లేరుపై నడకలా వచి్చనట్లు, ఎదిగినట్లు ఉండదు. ముఖ్యంగా జూనియర్‌ ఆటగాళ్లను ఆర్థిక కష్టాలు వేధిస్తాయి. స్పాన్సర్‌ షిప్‌ దొరకదు. అలాంటపుడు పెద్ద టోరీ్నలు ఆడేలా, భవిష్యత్తు తీర్చిదిద్దుకునేలా చేయూత లభించదు’ అని ముక్కుసూటిగా మాట్లాడాడు. అలాగే నేర్చుకోవాలన్నా... శిక్షణ పొందాలన్నా... మౌలిక సదుపాయాలు చాలా దూరంగా ఉంటాయని, 15 కిలోమీటర్లు వెళ్లి రావాల్సి ఉంటుందని ఆటగాళ్ల కష్టాలు వివరించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా