'పాకిస్తాన్ పేసర్ల భయం అక్కర్లేదు'

17 Jun, 2017 20:23 IST|Sakshi
'పాకిస్తాన్ పేసర్ల భయం అక్కర్లేదు'

న్యూఢిల్లీ:చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ బౌలింగ్ ను చూసి భారత జట్టు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత పాకిస్తాన్ జట్టులో మొహ్మద్ అమిర్ అత్యుత్తమ బౌలర్ అయినప్పటికీ, అతను భారత్ బ్యాటింగ్ పై పైచేయి సాధిస్తాడని అనుకోవడం లేదన్నాడు.

 

గతంలో ఇరు జట్లు ఆడినప్పుడు కూడా భారత్ బ్యాటింగ్ కు, పాకిస్తాన్ బౌలింగ్ కు ఫైట్ జరిగిన విషయాన్ని గంభీర్ ఈ సందర్బంగా ప్రస్తావించాడు. పాకిస్తాన్ బౌలింగ్ కు భారత్ వణికిపోయిన రోజుల్ని తాను ఎప్పుడూ చూడలేదన్నాడు. ఆదివారం నాటి ఫైనల్లో కూడా పాక్ బౌలింగ్ పై భారత్ బ్యాటింగ్ దే ఆధిపత్యం అవుతుందన్నాడు. ఇంగ్లండ్ లో ఫ్లాట్ పిచ్లు ఎదురుకావడంతో బౌలర్లకు అనుకూలిస్తాయని అనుకోవడం లేదన్నాడు. అనుకూలించే పిచ్ లపై  మాత్రమే ప్రభావం చూపే అమిర్.. ఫైనల్ పోరులో సాధారణ బౌలింగ్ కే పరిమితమవుతాడని గంభీర్ జోస్యం చెప్పాడు.

మరిన్ని వార్తలు