'మూడో వన్డేకు టైమ్‌ లేదు'

5 Feb, 2018 13:14 IST|Sakshi
దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు తాత్కాలిక కెప్టెన్‌ మర్‌క్రామ్‌

కేప్‌టౌన్‌: ఇప్పటికే భారత్‌తో ఆరు వన్డేల సిరీస్‌లో వెనుకబడిన తమ జట్టు మూడో వన్డేకు సన్నద్ధం కావడానికి తగినంత సమయం లేదని దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్‌ మర్‌క్రామ్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. గత రెండు వన్డేల్లో పేలవమైన ప్రదర్శనతో ఘోర పరాజయాల్ని ఎదుర్కొన్న విషయాన్ని అంగీకరించిన మర్‌క్రామ్‌.. కీలకమైన మూడో వన్డేకు ప్రిపేర్‌ కావడానికి కావాల్సినంతం సమయం లేదన్నాడు.

రెండో వన్డే తర్వాత మాట్లాడిన మర్‌క్రామ్‌..' సిరీస్‌లో నిలబడాలంటే కచ్చితంగా మూడో వన్డేలో గెలుపు మాకు అవసరం. ఆ మేరకు సన్నద్ధమవడానికి యత్నిస్తాం. అయితే తగినంత సమయం లేదనే చెప్పాలి. కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. మేము రెండు వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాం. మా జట్టు సమష్టి ప్రదర్శన చేయలేదు. కేప్‌టౌన్‌లో వన్డే మాకు చాలా చాలా కీలకం. ఆ వన్డేలో అంతా రాణిస్తారని ఆశిస్తున్నా. రెండు వన్డేల్లో ఎదురైన పరాభవాల నుంచి గుణపాఠం నేర్చుకుని తదుపరి మ్యాచ్‌కు సిద్ధం కావాల్సి ఉంది. ఆటలో ఎత్తు-పల్లాలు అనేవి సర్వ సాధారణం. వాటిని పట్టించుకోవాల్సిన అవసర లేదు' అని మర్‌క్రామ్‌ తెలిపాడు. రెండో వన్డేకు ముందు దక్షిణాఫ్రికా రెగ్యులర్‌ కెప్టెన్‌ డు ప్లెసిస్‌ గాయపడటంతో ఆ స్థానంలో మర్‌క్రామ్‌కు సారథిగా బాధ్యతలు అప్పజెప్పారు. దక్షిణాఫ్రికా-భారత్‌ జట్ల మధ్య మూడో వన్డే కేప్‌టౌన్‌లో బుధవారం జరుగనుంది.

>
మరిన్ని వార్తలు