జొకోవిచ్ కోచ్‌గా బెకర్

19 Dec, 2013 01:50 IST|Sakshi
నొవాక్ జొకోవిచ్

బెల్‌గ్రేడ్: వచ్చే ఏడాది మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకోవాలని.. మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గాలనే లక్ష్యంలో భాగంగా సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ జర్మనీ దిగ్గజం బోరిస్ బెకర్‌ను తన ప్రధాన కోచ్‌గా నియమించుకున్నాడు. ఇంతకాలం ప్రధాన కోచ్‌గా ఉన్న మరియన్ వజ్దా స్థానంలో బెకర్ వస్తాడు. అయితే కోచ్‌ల బృందంలో వజ్దాతోపాటు మిల్జాన్ అమనోవిచ్, గెబార్డ్ ఫిల్ గ్రిటిష్ కూడా కొనసాగుతారని ప్రస్తుతం ప్రపంచ రెండో ర్యాంకర్‌గా ఉన్న జొకోవిచ్ తెలిపాడు. 46 ఏళ్ల బెకర్ తన కెరీర్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో కలిపి మొత్తం 64 టోర్నమెంట్‌లలో విజేతగా నిలిచాడు. వచ్చే ఏడాదిలో జనవరి 13న మొదలయ్యే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి జొకోవిచ్‌తో కలిసి బెకర్ పనిచేస్తాడు.
 
 జొకోవిచ్, సెరెనాలకు ఐటీఎఫ్ పురస్కారాలు
 అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) 2013 సంవత్సరానికి జొకోవిచ్, సెరెనా విలియమ్స్‌లను వరల్డ్ చాంపియన్స్‌గా ప్రకటించింది.  జొకోవిచ్‌కిది వరుసగా మూడో పురస్కారం కాగా సెరెనా ఖాతాలో నాలుగోసారి చేరింది.
 

మరిన్ని వార్తలు