జొకోవిచ్ అవుట్

19 Jan, 2017 14:50 IST|Sakshi
జొకోవిచ్ అవుట్

సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆదిలోనే ప్రపంచ రెండో ర్యాంకు టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ కు షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్ లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో జొకోవిచ్ ఓటమి పాలయ్యాడు. ఉజెకిస్తాన్ కు చెందిన అన్ సీడెడ్ ఆటగాడు డెనిస్ ఇస్తోమిన్  6-7(8), 7-5, 6-2, 6-7(5), 4-6 తేడాతో జొకోవిచ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు.


టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను తీవ్రంగా శ్రమించి గెలిచిన జొకోవిచ్.. రెండో సెట్‌ను జార విడుచుకున్నాడు. అనంతరం మూడు సెట్‌ను సునాయాసంగా కోల్పోయిన జొకోవిచ్.. నాల్గో సెట్ గెలిచాడు. ఆపై నిర్ణయాత్మక ఐదో సెట్లో జొకోవిచ్ ను డెనిస్ మట్టికరిపించాడు. దాంతో డెనిస్ మూడో రౌండ్లోకి ప్రవేశించగా, జొకోవిచ్ భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు