జొకోవిచ్‌ ముచ్చటగా మూడోసారి

10 Sep, 2018 08:27 IST|Sakshi

న్యూయార్క్‌: ఈ సీజన్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న నొవాక్‌ జొకోవిచ్‌(సెర్బియా) మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మాజీ విజేత(2009) డెల్‌పొట్రోపై ఘన విజయం సాధించాడు. దీంతో సెర్బియా స్టార్‌ మూడో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం అర్థరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌లో ఆరో సీడ్‌ జొకోవిచ్‌ 6-3, 7-6,(7/4), 6-3తో అర్జెంటీనా ఆజానుబావుడు డెల్‌పొట్రోపై విజయం సాధించాడు. మ్యాచ్‌ ఆద్యంతం సెర్బియా వీరుడు తన ఫామ్‌ను కొనసాగించాడు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 

తొలి సెట్‌ను కోల్పోయిన తర్వాత డెల్‌పొట్రో అనూహ్యంగా కోపుంజుకున్నాడు. రెండో సెట్‌ నువ్వానేనా అన్నట్టు సాగినా.. జొకోవిచ్‌ దూకుడు ముందు అర్జెంటీనా స్టార్‌ నిలువలేకపోయాడు. ఇక మూడో సెట్‌లోనూ జొకోవిచ్‌ ఏ చిన్న అవకాశం ప్రత్యర్థికి ఇవ్వలేదు. దీంతో చివరి సెట్‌ కూడా గెలిచి.. 14వ గ్రాండ్‌స్లామ్‌ తన ఖాతాలో వేసుకొని పీట్‌ సంప్రాస్‌ సరసన చేరాడు. ఇక ఈ జాబితాలో రోజర్‌ ఫెడరర్‌(20 టైటిల్స్‌), రఫెల్‌ నాదల్‌(17 టైటిల్స్‌) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

సీన్‌ రివర్స్‌..
ఏడాది క్రితం రఫెల్‌ నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ ట్రోఫీ సొంతం చేసుకున్న వేళ గాయం కారణంగా సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఇంట్లో ఉన్నాడు. సంవత్సరం తిరిగేలోపు పరిస్థితి మారిపోయింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ నాదల్‌ మాజీ విజేత డెల్‌పొట్రోతో జరిగిన సెమీఫైనల్లో మోకాలి గాయంతో మధ్యలోనే వైదొలగగా... పూర్తి ఫిట్‌నెస్‌ సంతరించుకున్న జొకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌ ట్రోఫిని ముద్దాడాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

         

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రోమో వైరల్‌: కోహ్లి న్యూజిలాండ్‌ వస్తున్నాడు..

మరో చరిత్రే లక్ష్యంగా టీమిండియా..

నా కుటుంబ సభ్యులు కూడా ఎంజాయ్‌ చేశారు: రిషభ్‌

అందుకు హార్దిక్‌ పాండ్యానే కారణం: ధావన్‌

క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అందుకే నేను అదృష్టవంతుడిని అయ్యాను’

‘ఇండియన్‌ 2’ షూటింగ్‌ రేపే ప్రారంభం!

శంకర్‌ సినిమాలో మరోసారి విలన్‌గా..!

‘మహర్షి’ మరింత ఆలస్యం కానుందా..!

రణవీర్‌కు దీపిక షరతులు..!

‘ఆయ‌న ఎంతో మందికి స్ఫూర్తి’