సంచలనం: ఐదుగురు డకౌట్‌

22 Mar, 2018 08:46 IST|Sakshi
ఇంగ్లండ్‌ న్యూజిలాండ్‌ డే–నైట్‌ టెస్టు మ్యాచ్‌

58 పరుగులకే ఆలౌట్‌

ఆక్లాండ్‌: ఇంగ్లండ్‌తో ప్రారంభమైన డే–నైట్‌ టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ సంచలనం నమోదు చేసింది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కివీస్‌.. ఇంగ్లీషు టీమ్‌ను అత్యల్ప స్కోరుకే కుప్పకూల్చింది. న్యూజిలాండ్‌ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ట్రెంట్‌ బోల్ట్‌, టిమ్‌ సౌతి.. ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించారు.

పదునైన బంతులతో వీరిద్దరూ చెలరేగడంతో 20.4 ఓవర్లలో 58 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌటైంది. ఇంగ్లండ్‌కు ఇది ఓవరాల్‌గా ఆరో అతిస్వల్ప స్కోరు కావడం గమనార్హం. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ పరుగులేమీ చేయకుండానే అవుటయ్యారు. జో రూట్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌, మహ్మద్‌ అలీ, స్టువర్ట్‌ బ్రాడ్‌ డకౌటయ్యారు. ఓవర్టన్‌ (33), స్టోన్‌మన్‌(11) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు.

బోల్ట్‌ 32 పరుగులిచ్చి 6 వికెట్లు నేలకూల్చాడు. సౌతి 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరూ మూడేసి మేడిన్‌ ఓవర్లు వేయడం విశేషం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు