వెలవెలబోయిన ‘జ్యోతి’ స్వాగత వేడుకలు 

21 Mar, 2020 04:21 IST|Sakshi

హిగషిమత్‌సుషిమా (జపాన్‌): అసలు టోక్యో ఒలింపిక్స్‌ జరుగుతాయా? జరుగవా? అనే సందేహాల మధ్య ‘ఒలింపిక్స్‌ జ్యోతి’ ప్రభ రోజురోజుకీ తగ్గిపోతోంది. ఏథెన్స్‌లో జ్యోతి రిలే కార్యక్రమం తూతూ మంత్రంగా జరుగగా... జపాన్‌లోనూ స్వాగత వేడుకలు నామమాత్రంగానే నిర్వహించారు. శుక్రవారం ప్రత్యేక విమానంలో ఒలింపిక్‌ జ్యోతి ఏథెన్స్‌ నుంచి ఉత్తర జపాన్‌లోని మిత్సుషిమ ఎయిర్‌బేస్‌కు చేరుకుంది. అయితే కరోనా కారణంగా స్వాగత వేడుకలకు రావాల్సిన 200 మంది పాఠశాల విద్యార్థులను ఆహ్వానించలేదు. దీంతో అతికొద్ది మంది అధికారులు, మాజీ ఒలింపిక్‌ చాంపియన్స్‌ సయోరి యోషిదా (రెజ్లింగ్‌), టడాహిరో నోమురా (జూడో) మాత్రమే వేడుకలో  పాల్గొన్నారు. దాంతో ఈ కార్యక్రమం కళ తప్పినట్లయింది. ఒకవైపు కోవిడ్‌–19 వైరస్‌ ఆందోళన కలి గిస్తున్నా... టోక్యో ఒలింపిక్స్‌ను షెడ్యూల్‌ ప్రకా రం ఈ  ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వ హించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవ కాశాలను పరిశీలిస్తున్నామని అంతర్జాతీయ ఒలిం పిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు