ఒలింపియన్ సైకిళ్లను దొంగలెత్తుకెళ్లారు

3 Mar, 2016 20:58 IST|Sakshi
ఒలింపియన్ సైకిళ్లను దొంగలెత్తుకెళ్లారు

ఒలింపిక్ హీరో, బ్రిటన్ సైక్లిస్టు క్రిస్ బోర్డ్ మన్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ లెజెండరీ బైకర్ ఉపయోగించే సైకిళ్లను ఎత్తుకెళ్లారు. అంతే కాదు. లక్షల రూపాయల విలువ చేసే సైక్లింగ్ ఎక్యుప్ మెంట్ దోచుకెళ్లారు. గైటన్ గ్రామంలోని క్రిస్ కి చెందిన  గ్యారేజీలో సోమవారం తెల్లవారుజామున ఈ దోపిడీ జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ఒక్కొక్కటీ 1,000 పౌండ్ల (భారత కరెన్సీలో 95వేలు)విలువైన  రెండు ఎలెక్ట్రిక్ జీ-టెక్ ఈ- బైక్ సిటీ బైకులు, ఒక స్పెషల్ బోర్డ్ సైకిల్ ను దొంగలు ఎత్తుకుపోయారు. దోపిడీని గుర్తించిన క్రిస్ సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందిచాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సైకిళ్ల దొంగ కోసం గాలించడం మొదలు పెట్టారు.

దొంగ తనం గురించి మాట్లాడిన డిటెక్టీవ్ కానిస్టేబుల్ జాన్ మోలినెక్స్ మాట్లాడుతూ.. అదృష్ట వశాత్తు ఈ దోపిడీ జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని అన్నాడు. ఎవరైనా ఉండి ఉంటే..జరిగే నష్టం ఊహించడమే కష్టం అని చెప్పుకొచ్చాడు.కాగా.. క్రిస్ బోర్డమన్ 1992 బార్సిలోనా ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడంతో పాటు.. మూడు సార్లు 'టూర్ డి ఫ్రాన్' టైటిళ్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
 

మరిన్ని వార్తలు