ఓపెనింగ్‌ను మార్చాలి

21 Nov, 2013 00:58 IST|Sakshi

పెంటేల హరికృష్ణ
 చెస్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు 8 గేమ్‌లు ముగిసినా.. ఆనంద్‌కు కీలకమైన విజయం మాత్రం లభించలేదు. రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్న కార్ల్‌సెన్ టోర్నీలో మెరుగైన స్థితిలో ఉన్నాడు. అయితే 5, 6 గేమ్‌ల్లో ఓటమి తర్వాత చివరి రెండు గేమ్‌లు డ్రా చేసుకోవడం ఆనంద్‌కు కాస్త ఉపశమనం కలిగించే అంశం. ఇక మిగిలింది 4 గేమ్‌లే. కాబట్టి 9వ గేమ్‌లో తెల్లపావులతో ఆడే ఆనంద్ చాలా రిస్క్ తీసుకోవాలి.
 
  బెర్లిన్ డిఫెన్స్‌లోకి వెళ్లకుండా ఓపెనింగ్ వ్యూహాన్ని పూర్తిగా మారుస్తాడని నా నమ్మకం. గత గేమ్‌ల్లో కార్ల్‌సెన్... బెర్లిన్ డిఫెన్స్‌ను పునరావృతం చేసినా మంచి ఫలితాల్నిచ్చింది. 7, 8 గేమ్‌లు  చాలా బోరింగ్‌గా డ్రా అయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆనంద్ మరో డ్రా చేసుకోవడం సరైంది కాదు.  9వ గేమ్‌లో అతను కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఓపెనింగ్ దశ ముగిసిన తర్వాత ఆనంద్ అంత నమ్మకంగా కనిపించలేదు. ఇది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. 9వ గేమ్‌లో పుంజుకోవాలంటే తనపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
 

మరిన్ని వార్తలు