7 Aug, 2018 14:38 IST|Sakshi

లాస్‌ ఏంజిల్స్‌: టెన్నిస్‌ సూపర్‌స్టార్‌ సెరెనా విలియమ్స్‌ తనపై వస్తున్న విమర్శలపై మండిపడ్డారు. 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఈ అమెరికా నల్లకలువ ఇటీవల జరిగిన వింబుల్డన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, టోర్నమెంట్లలో తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. సొంతదేశం అమెరికాలో జూలై 31న జరిగిన చరిత్రత్మక శాన్‌జోస్‌ సిలికాన్‌ వ్యాలీ క్లాసిక్‌ టోర్నీలో సైతం ఓటమి చవిచూశారు. 

సెరెనా 2017లో కూతురు అలెక్సిస్‌ ఒలంపియా ఒహానియన్‌ జూనియర్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ ఏడాదిలో తిరిగి కోర్టులోకి అడుగుపెట్టిన సెరేనా సరిగా ఆడలేపోయింది. అమ్మ అయిన తర్వాత  ఆటలో వెనకబడడంతో ఆమెపై కొందరు విమర్శలు చేస్తున్నారు. వీటన్నిటిపై ఆమె స్పందించారు. తాను ప్రసవానంతర ఉద్వేగాలతో సతమతమవుతున్నాని తెలిపారు. కొన్ని సార్లు తన కూతురుతో కొద్ది సమయం కూడా గడపలేక పోవడం బాధిస్తోందని అన్నారు. తనను విమర్శిస్తున్న వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నారనీ, బిడ్డకు జన్మనిచ్చిన వారెవరైనా మళ్లీ మాములు జీవనం సాగించడం అంత సులువు కాదనిఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన సెరెనా.. విమర్శలకు బదులిచ్చే తీరిక తనకు లేదని ఇదివరకే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు