ఓవరాల్ చాంప్‌గా ఎంవీఎస్‌ఆర్

20 Aug, 2013 03:59 IST|Sakshi
ఓవరాల్ చాంప్‌గా ఎంవీఎస్‌ఆర్

జింఖానా, న్యూస్‌లైన్: ఇంటర్ కాలేజ్ స్విమ్మింగ్ టోర్నమెంట్లో ఆయుష్ యాదవ్ స్వర్ణపతకం సాధించాడు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో సోమవారం జరిగిన పురుషుల 100 మీ. ఫ్రీ స్టయిల్ విభాగంలో అతను మొదటి స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో వీరేశ్, దినకర్ వరుసగా రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో పురుషుల విభాగంలో ఎంవీఎస్‌ఆర్, మహిళల విభాగంలో సెయింట్ ఫ్రాన్సిస్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నాయి.
 
 ఫలితాలు
 పురుషుల 400 మీ. ఫ్రీ స్టయిల్: 1. సాయి సృజన్ (వాసవీ కాలేజ్), 2. ఋషి కుమార్ (లయోలా అకాడమీ), 3. అమన్‌దీప్ సింగ్ (అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్); 200 మీ. బటర్‌ఫ్లయ్: 1. ప్రణయ్ (ఐఐఎమ్‌సీ), 2. వీరేష్ (ఏవీ కాలేజ్), 3. ఆయుష్ యాదవ్ (భవాన్స్ కాలేజ్); 200 మీ. బ్యాక్ స్ట్రోక్: 1. దినకర్ (భవాన్స్ కాలేజ్), 2. యోగేందర్ (లయోలా అకాడమీ), 3. హరీష్ (మాతృశ్రీ కాలేజ్); 200 మీ. బ్రెస్ట్ స్ట్రోక్: 1. ఉదయ్ కుమార్ (ఎంవీఎస్‌ఆర్), 2. రోహన్ మానే (భవాన్స్ కాలేజ్), 3. రాహుల్ (ఎంవీఎస్‌ఆర్); 200 మీ. ఫ్రీ స్టయిల్: 1. సాయి సృజన్ రెడ్డి (వాసవీ కాలేజ్), 2. ప్రణయ్ కుమార్ (ఐఐఎంసీ), 3. ఋషి కుమార్ (లయోలా అకాడమీ); 100 మీ. బటర్‌ఫ్లై: 1. ప్రణయ్ కుమార్ (ఐఐఎంసీ), 2. వీరేష్  (ఏవీ కాలేజ్), 3. హబీబ్ అహ్మద్ (అన్వర్-ఉల్-ఉలూమ్); 100 మీ. బ్రెస్ట్ స్ట్రోక్: 1. ఉదయ్ కుమార్ (ఎంవీఎస్‌ఆర్), 2. రాహుల్ (ఎంవీఎస్‌ఆర్), 3. రోహన్ యానే (భవాన్స్ కాలేజ్); 100 మీ. బ్యాక్ స్ట్రోక్: 1. దినకర్ (భవాన్స్ కాలేజ్), 2. యోగేందర్ (లయోలా అకాడమీ), 3. హరీష్ (ఎంవీఎస్‌ఆర్); 50 మీ. బ్రెస్ట్ స్ట్రోక్: ఉదయ్ కుమార్ (ఎంవీఎస్‌ఆర్), 2. ప్రణయ్ కుమార్ (ఐఐఎమ్‌సీ), 3. దినకర్ (భవాన్స్ కాలేజ్); 50 మీ. బటర్‌ఫ్లయ్: 1. ప్రణయ్ కుమార్ (ఐఐఎంసీ), 2. దినకర్ (భవాన్స్ కాలేజ్), 3. ఉదయ్‌కుమార్ (ఎంవీఎస్‌ఆర్); 50 మీ. ఫ్రీ స్టయిల్: 1. యోగేందర్ (ఐఐఎంసీ), 2. ఉదయ్ కుమార్ (ఎంవీఎస్‌ఆర్), 3. సాయి సృజన్ రెడ్డి (వాసవీ కాలేజ్).  
 
 మహిళల 400 మీ. ఫ్రీ స్టయిల్: 1. నమిత (సెయింట్ ఫ్రాన్సిస్), 2. ప్రీతి కె. రెడ్డి (సెయింట్ ఫ్రాన్సిస్), 3. కరిష్మా (సెయింట్ ఫ్రాన్సిస్); 200 మీ. ఫ్రీ స్టయిల్: 1. శృతి వెల్లోరె (అరోరా); 2. హేమంగి మోర్జారియ (అరోరా), 3. శృతి (అరోరా); 200 మీ. బ్రెస్ట్ స్ట్రోక్ : 1. సాక్షి యాదవ్ (సెయింట్ ఫ్రాన్సిస్), 2. స్పటిక (సెయింట్ ఫ్రాన్సిస్); 100 మీ. బటర్‌ఫ్లయ్: 1. నమిత (సెయింట్ ఫ్రాన్సిస్), 2. హేమంగి మోర్జారియ (అరోరా).

మరిన్ని వార్తలు