20 ఓవర్లలో పాకిస్థాన్ స్కోరు 80/5

21 Feb, 2015 09:28 IST|Sakshi

క్రైస్ట్ చర్చి: పేకమేడలా కూలుతున్న పాకిస్థాన్ వికెట్ల పతనానికి మఖ్సూద్ (36),  ఉమర్ అక్మల్ (27) కాసేపు అడ్డుకట్ట వేశారు.  వెస్టిండీస్ నిర్దేశించిన 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన పాక్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది.


విండీస్ బౌలర్ జెరోమీ టేలర్ ధాటికి పాకిస్థాన్ ఆరంభంలోనే పీకల్లోతు కష్టాల్లోపడింది. టేలర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది. పాక్ పరుగుల ఖాతా తెరవకనే ఓపెనర్ నాజిర్ జంషెడ్ పెవిలియన్ చేరాడు. ఇదే ఓవర్లో యూనిస్ ఖాన్ కూడా అదే బాటపట్టాడు. టేలర్ తన మరుసటి ఓవర్లో హారిస్ సొహైల్ను అవుట్ చేశాడు. ఇక విండీస్ బౌలర్ హోల్డర్ ఆ తర్వాతి బంతికి హెహజాద్ను అవుట్ చేశాడు. దీంతో పాక్ ఒక్క పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ నలుగురూ క్యాచ్ అవుటయ్యారు. ప్రపంచ కప్ పూల్-బి మ్యాచ్లో శనివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు చేసింది.

>
మరిన్ని వార్తలు