పరుగుల వేటలో పాక్‌పై భారత్‌ బోల్తా

21 Nov, 2019 04:38 IST|Sakshi

పాకిస్తాన్‌ చేతిలో 3 పరుగుల తేడాతో ఓటమి

ఢాకా: ఆసియా ఎమర్జింగ్‌ కప్‌ అండర్‌–23 క్రికెట్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ ఫేవరెట్‌ భారత జట్టు పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌నిర్ణిత 50 ఓవర్లలో 8 వికెట్లకు 264 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో భారత్‌ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి.

అయితే పాక్‌ బౌలర్‌ అమాద్‌ బట్‌ వేసిన ఈ ఓవర్లో భారత్‌ వికెట్‌ కోల్పోవడంతోపాటు కేవలం నాలుగు పరుగులే చేసి ఓటమి చవిచూసింది. భారత ఇన్నింగ్స్‌లో శరత్‌ (47; 6 ఫోర్లు, సిక్స్‌), సనీ్వర్‌ సింగ్‌ (76; 5 ఫోర్లు, సిక్స్‌), అర్మాన్‌ జాఫర్‌ (46; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించినా కీలకదశలో అవుట్‌ కావడం దెబ్బ తీసింది. అంతకుముందు పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 267 పరుగులు సాధించింది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా