ఆ క్రికెటర్లు కొట్టుకున్నంత పనిచేశారు!

15 Dec, 2016 14:31 IST|Sakshi
ఆ క్రికెటర్లు కొట్టుకున్నంత పనిచేశారు!

బ్రిస్బేన్:పాకిస్తాన్ క్రికెట్లో వివాదాలు కొత్తేమీ కాదు. ఆ క్రికెటర్లు ఏదొక వివాదాన్ని సృష్టస్తూ క్రికెట్ బోర్డుకు తలనొప్పిని తెచ్చిపెట్టడాన్ని చాలా సందర్భాల్లో చూశాం. తాజాగా పాక్ క్రికెటర్ల మధ్య వాడివేడి మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాక్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇద్దరు సీనియర్ క్రికెటర్లు వాహబ్ రియాజ్, యాసిర్ షాల మధ్య జరిగిన గొడవ తారాస్థాయికి చేరింది. వీరిద్దర మధ్య చిన్నగా మొదలైన ఘర్షణ చివరకు ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది.

 

బుధవారం ఫుట్ బాల్తో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రియాజ్తో యాసిర్ గొడవ పడ్డాడు. దాంతో నువ్వేంత అంటే నువ్వెంత అనే వరకూ ఆ క్రికెటర్లు తమ మాటల వాడిని కొనసాగించారు. ఆ గొడవ ముదరడంతో జట్టు సభ్యులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఈ మేరకువారి మధ్య జరిగిన ఘర్షణ ఫోటోను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ట్వీట్ చేసింది. దాంతో ఆ క్రికెటర్లపై చర్యలు తప్పవని అంతా భావించారు. కాగా,  ఆ గొడవను పాక్ క్రికెట్ టీమ్ మేనేజర్ వాసిమ్ బారి కొట్టిపారేశారు. ఇది  పెద్ద ఘర్షణగా కాదని పేర్కొన్న బారి.. ఆ క్రికెటర్లపై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం లేదని ప్రకటించాడు.


గతంలో షోయబ్ అక్తర్-మొహ్మద్ అసిఫ్లు ఫీల్డ్లోనే ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. 2007 వరల్డ్ టీ 20 సమయంలో షోయబ్ అక్తర్  అసిఫ్ ను బ్యాట్తో కొట్టాడు. అది అప్పట్లో అది పెద్ద వివాదమైంది.  ఆ తరువాత తన కెరీర్ ముగింపుకు వసీం అక్రమే కారణమంటూ అక్తర్ ధ్వజమెత్తి మరో వివాదానికి తెరలేపాడు. ఇదిలా ఉండగా, ఒక టీ షోలో మొహ్మద్ యూసఫ్-రమీజ్ రాజాలు ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకున్నారు. మరొకవైపు పాకిస్తాన్ సూపర్ లీగ్(పీసీఎల్)లో వాహబ్ రియాజ్- అహ్మద్ షెహ్జాద్లు ఒకర్నినొకరు తోసుకున్నారు. దాంతో పాటు దూషణలకు దిగి వివాదాన్నిపెద్దది చేశారు.

మరిన్ని వార్తలు