మిస్బా గుడ్ బై!

6 Apr, 2017 19:39 IST|Sakshi
మిస్బా గుడ్ బై!

కరాచీ:పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ తన అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో వెస్టిండీస్ తో జరిగే టెస్టు సిరీస్ తనకు చివరిదని మిస్బా తెలిపాడు. ఈ మేరకు గురువారం తన క్రికెట్ కెరీర్ పై ఓ ప్రకటన చేశాడు.'విండీస్ తో సిరీస్ నాకు ఆఖరిది. ఈ విషయాన్ని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ కు ఇప్పటికే తెలియజేశా. నా చివరి సిరీస్ ను విజయవంతంగా ముగించాలని అనుకుంటున్నా. దాని కోసం యత్నిస్తా. నాపై ఎటువంటి ఒత్తిడి లేదు'అని పాకిస్తాన్ క్రికెట్ లో అత్యంత సక్సెస్ ఫుల్ గా నిలిచిన మిస్బా అన్నాడు.

53 టెస్టు మ్యాచ్ లకు సారథిగా మిస్బా వ్యవహరించాడు. అందులో 23 విజయాలు, 11 డ్రాలు, 18 ఓటములు ఉన్నాయి. ఈ నెల 21న పాకిస్థాన్‌-వెస్టిండీస్‌ మధ్య మూడు టెస్టుల సిరీస్‌ తరువాత మిస్బా  కెరీర్ కు గుడ్ బై చెప్పనున్నాడు. అయితే దేశవాళీ క్రికెట్ లో మాత్రం కొనసాగుతానని మిస్బా తెలిపాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ను నియమించాలని చూస్తున్న పీసీబీ.. దానిలో భాగంగా మిస్బాపై ఒత్తిడి తెచ్చింది. ఇక పాకిస్తాన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చైర్మన్ షహర్యార్ తేల్చిచెప్పడంతో మిస్బా తన అంతర్జాతీయ కెరీర్ కు ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు