మాకూ ఒక విరాట్ ఉన్నాడు!

12 Dec, 2016 15:03 IST|Sakshi
మాకూ ఒక విరాట్ ఉన్నాడు!

కరాచీ:ఇటీవల కాలంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో విరాట్ కోహ్లిని పోల్చడం ఎక్కువైతే, అదే సమయంలో కోహ్లితో వేరే క్రికెటర్లని పోల్చడం కూడా సాధారణంగా మారిపోయింది. ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్లలో విరాట్ ఒకడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే విరాట్ కోహ్లితో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్‌ను, దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డీ కాక్‌ను పోలుస్తున్నారు. కాగా,  తమకూ విరాట్ కోహ్లిలాంటి ఆటగాడు ఉన్నాడంటూ పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మికీ ఆర్థర్ తాజాగా స్పష్టం చేశాడు. గతేడాది వన్డేల్లో అరంగేట్రం చేసిన పాక్ క్రికెటర్ బాబర్ అజమ్‌ను విరాట్‌తో పోల్చాడు.

'మా యువ బుల్లెట్ బాబర్ అజమ్. అతనొక అసాధారణ ఆటగాడు. భారత జట్టులో విరాట్ ఎంత కీలక ఆటగాడో అదే తరహాలో బాబర్ అజమ్ కూడా  పాక్ కు ముఖ్యమైన క్రికెటర్. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో విరాట్‌కు సరితూగే ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది బాబర్ అజమ్.  ఈ విషయాన్ని ముందుగా ఊహించి చెబుతున్నా' అని ఆర్థర్ తెలిపాడు.

గతేడాది అంతర్జాతీ వన్డేల్లో ప్రవేశించిన బాబర్ అజమ్.. ఇప్పటివరకూ 18 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో మూడు సెంచరీలు నమోదు చేయగా, 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. మరొవైపు టెస్టుల్లో ఈ ఏడాది అజమ్ అరంగేట్రం చేసి మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఇక్కడ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో 90 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు