పాకిస్థాన్కు చావుదెబ్బ!!

10 Sep, 2014 12:44 IST|Sakshi
పాకిస్థాన్కు చావుదెబ్బ!!

తమ జట్టులో ప్రధాన స్పిన్నర్.. చాలావరకు మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించగల సత్తా ఉన్న సయీద్ అజ్మల్ మీద నిషేధం వేటు పడటంతో పాకిస్థాన్ జట్టుకు చావుదెబ్బ తగిలింది. వన్డేలలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న అజ్మల్ బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉందని గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఐసీసీ అతడి బౌలింగ్ యాక్షన్ను ఓ స్వంతంత్ర సంస్థతో పరిశీలించి నివేదిక తెప్పించుకుంది. బంతులు వేసేటప్పుడు అజ్మల్ తన చేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు తేలడంతో అతడి మీద నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణం అమలులోకి వస్తుందని, ఇక నుంచి ఈ పాకిస్థాన్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకూడదని స్పష్టం చేసింది.

పాకిస్థాన్ తరఫున ఇప్పటి వరకు 35 టెస్టులు ఆడిన అజ్మల్ 178 వికెట్లు తీశాడు. 111 వన్డేల్లో 183 వికెట్లు తీసి జట్టు బౌలింగ్‌కు పెద్ద దిక్కుగా మారాడు. గత నెలలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 36 ఏళ్ల అజ్మల్ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని ఆరోపణలు వచ్చాయి. చివరకు.. అజ్మల్ బౌలింగ్ నిబంధనల ప్రకారం లేదని నివేదిక ఇవ్వడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇదే ఇప్పుడు పాక్ జట్టుకు ఆశనిపాతంలా మారింది.

మరిన్ని వార్తలు