వన్డేల్లో పాక్ క్రికెటర్ అజేయ ట్రిపుల్ సెంచరీ

25 May, 2017 17:09 IST|Sakshi
వన్డేల్లో పాక్ క్రికెటర్ అజేయ ట్రిపుల్ సెంచరీ

న్యూఢిల్లీ: వన్డే క్రికెట్ లో పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్ చరిత్ర సృష్టించాడు. 50 ఓవర్ల మ్యాచ్లో 175 బంతులు ఎదుర్కొని 320 పరుగలతో అజేయంగా నిలిచాడు. పీసీబీ ఫజల్ మహమూద్ ఇంటర్‌ క్లబ్‌ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్ లో భాగంగా శిఖర్ పూర్ కు చెందిన బిలాల్ ఇర్షాద్ అజేయ ట్రిపుల్ సెంచరీ సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అల్ రెహ్మాన్ సీసీ జట్టుపై ఆడి ఈ ఫీట్ నమోదుచేశాడు.

షాహీద్‌ అలామ్‌ బక్స్‌ క్రికెట్‌ క్లబ్ తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగిన బిలాల్ 50 ఓవర్లు ముగిసేవరకూ క్రీజులో నిలిచాడు. ఈ క్రమంలో 175 బంతులు ఎదుర్కొని 9 సిక్సర్లు, 42 ఫోర్ల సాయంతో అజేయ ట్రిపుల్ సెంచరీని సాధించాడు. జట్టు ఆటగాడు జకీర్ హుస్సేన్ తో కలిసి రెండో వికెట్ కు 364 పరుగుల భాగస్వామ్యం అందించాడు. బిలాల్ విధ్వంసక ఇన్నింగ్స్ తో ఓవరాల్ గా వారి జట్టు నిర్ణీత ఓవర్లలో 556 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో అల్ రెహ్మాన్ సీసీ స్వల్ప స్కోరుకే పరిమితం కావడంతో 411 పరుగుల భారీ తేడాతో షాహీద్‌ అలామ్‌ బక్స్‌ విజయం సాధించింది.

మరిన్ని వార్తలు