మరో క్రికెటర్‌పై ఏడాది నిషేధం

12 Dec, 2017 11:47 IST|Sakshi

కరాచీ: తనపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో భాగంగా విచారణకు సహకరించనందుకు పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ నాసిర్‌ జంషెడ్‌పై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆ దేశ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) నిర్ణయం తీసుకుంది. దాంతో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) వంటి తదితర టోర‍్నీలకు జంషెడ్‌ను ఏడాది పాటు బహిస్కరిస్తున్నట్లు పేర్కొంది. గతేడాది ఒక టీ 20 టోర్నమెంట్‌లో జంషెడ్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్‌ బోర్డు నేతృత్వంలోని యాంటీ కరెప్షన్‌ యూనిట్‌(ఏసీయూ) విచారణ చేపట్టడానికి సిద్దమవ్వగా, అందుకు జంషెడ్‌ సహకరించలేదు. దాంతో అతనిపై ఏడాది నిషేధం విధిస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది.

అంతకుముందు పలువురు పాక్‌ క్రికెటర్లు స్పాట్‌ ఫిక్సింగ్‌లో ఇరుక్కుని నిషేధం ఎదుర్కొంటున్నారు. అందులో బ్యాట్స్‌మెన్‌ షార్జిల్‌ ఖాన్‌, ఖలిద్‌ లతీఫ్‌లపై ఐదేళ్ల పాటు నిషేధం విధించగా, పేసర్‌ మొహ్మద్‌ ఇర్ఫాన్‌, ఆల్‌ రౌండర్‌ మొహ్మద్‌ నవాజ్‌లపై 12నెలల నిషేధం పడింది.

మరిన్ని వార్తలు