మనోడిని విందుకు పిలిచారు..

25 Nov, 2019 19:56 IST|Sakshi
ఆస్ట్రేలియాతో మొదటి టెస్ట్‌లో పాకిస్తాన్‌ ఆటగాళ్లు

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్‌లో పాకిస్తాన్‌ ఓటమిపాలైంది. అయితే పాకిస్తాన్‌ టీమ్‌లోని కొందరు భారత ట్యాక్సీ డ్రైవర్‌ పట్ల తమ సహృదయతను చాటుకుని ప్రేక్షకుల మన్నన చూరగొన్నారు. ఈ ఘటన గురించి ప్రముఖ కామెంటేటర్‌ ఆలిసన్‌ మిచెల్‌ రేడియో ప్రత్యక్ష ప్రసారంలో వెల్లడించారు. ఆసీస్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ జాన్స్‌న్‌కు ఈ ఆసక్తికర సంఘటన గురించి తెలిపారు.

‘యాసిర్‌ షా, షహీన్‌ ఆఫ్రిది, నసీమ్‌ షా సహా ఐదుగురు పాకిస్తాన్‌ క్రికెటర్లు ఇండియన్‌ రెస్టరెంట్‌కు వెళ్లాలనుకున్నారు. భారత ట్యాక్సీ ఒకరు ఈ ఐదుగురిని ఇండియన్‌ రెస్టరెంట్‌కు తీసుకెళ్లాడు. ట్యాక్సీ దిగిన తర్వాత డబ్బులు ఇవ్వగా డ్రైవర్‌ సున్నితంగా తిరస్కరించాడు. తమ పట్ల భారత ట్యాక్సీ​ డ్రైవర్‌ చూపిన ఆదరాభిమానులకు ముగ్దులైన పాక్‌ క్రికెటర్లు అతడిని తమతో పాటు భోజనానికి పిలిచారు. పాకిస్తాన్‌ ఆటగాళ్ల పక్కన కూర్చుని ఆనందంగా విందు ఆరగిస్తున్న ఫొటోలను తన ఫోన్‌లో ట్యాక్సీ డ్రైవర్‌ తనకు చూపించాడ’ని ఆలిసన్‌ మిచెల్‌ వెల్లడించారు. ఈ వీడియో వెంటనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మానవీయ కథనం చాలా బాగుంది అంటూ నెటిజనులు కామెంట్లు పెట్టారు. గ్రేట్‌ స్టోరీ అంటూ కొంతమంది ప్రశంసించారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు... 

ఆటగాళ్లూ... మీ స్థానాలు భద్రం 

భారత షాట్‌పుట్‌ క్రీడాకారుడిపై నాలుగేళ్ల నిషేధం 

ధోని కోరిక తీరకపోవచ్చు! 

ఇలాంటి ‘విశ్రాంతి’ కావాల్సిందే! 

సినిమా

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు

‘జుమాంజి’ నటికి కరోనా