బంగ్లా జట్టుకు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించిన పాక్

2 Mar, 2016 20:44 IST|Sakshi
బంగ్లా జట్టుకు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించిన పాక్

మిర్పూర్: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది. ఆతిథ్య బంగ్లా జట్టుకు 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సర్ఫరాజ్(42 బంతుల్లో, 58 పరుగులు: 5 ఫోర్లు, 2 సిక్సులు) అర్ధ శతకంతో ఆదుకోవడంతో పాక్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. షోయబ్ మాలిక్(31 బంతుల్లో 41 పరుగులు) కూడా రాణించాడు. బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ 12 పరుగులకే జట్టు ఓపెనర్లను కోల్పోయింది.

ఆరుఓవర్లకు పాక్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 20 పరుగులే చేయడం.. 28 పరుగుల వద్ద నాలుగో వికెట్ రూపంలో ఉమర్ అక్మల్(4) పరుగులకే ఔటవ్వడంతో పాక్ ఆచితూచి ఆడటం మొదలుపెట్టింది. షోయబ్ మాలిక్ ఔటైన తర్వాత ఆ జట్టు బాధ్యతను సర్ఫరాజ్ తనపై వేసుకుని చివర్లో షాట్లు ఆడటంతో పాక్ పోరాడే స్కోరును చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో అమిద్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆరాఫత్ సన్నీ 2, టస్కీన్, మొర్తాజా తలో వికెట్ తీశారు.

 

మరిన్ని వార్తలు