ఆమిర్ కు థ్రిల్.. గుల్ కు షాక్

10 Feb, 2016 17:41 IST|Sakshi
ఆమిర్ కు థ్రిల్.. గుల్ కు షాక్

కరాచీ: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ టోర్నీలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బుధవారం జాతీయ జట్టు ప్రకటించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై జైలు శిక్ష పడటంతో ఐదేళ్లు నిషేధానికి గురై, అటుపై నిరపరాధిగా తేలి తిరిగి జట్టులోకి వచ్చిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మొహమ్మద్ ఆమిర్.. జట్టులో స్థానం పొంది మళ్లీ వార్తల్లో నిలిచాడు. సీనియర్ పేసర్ ఉమర్ గుల్, ఓపెనర్ అహ్మద్ షెహజాద్ లపై వేటు పడింది.

 

సీనియర్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ నేతృత్వంలోని పాక్ జట్టు ఈ నెల 24 నుంచి బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న ఆసియాకప్ లో పాల్గొంటుంది. మార్చి 8 నుంచి భారత గడ్డపై జరుగనున్న టీ20 ప్రపంచకప్ లో పాక్ ఆడాల్సిన మ్యాచ్ ల వేదికలపై ఇంకా స్పష్టత రాలేదు. భద్రతాకారణాల దృష్ట్యా ఇండియాలో ఆడబోమని పీసీబీ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లకు పాక్ జట్టు:
షాహిద్ అఫ్రిది(కెప్టెన్), ఖుర్రం మంజూర్, మొహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్(వికెట్ కీపర్), సర్ఫరాజ్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఇఫ్తికార్ అహ్మద్, ఎమద్ వసీమ్, అన్వర్ అలీ, మొహమ్మద్ ఇర్ఫాన్, వాహబ్ రియాజ్, మొహమ్మద్ ఆమిర్, మొహమ్మద్ నవాజ్, రుమన్ రయీజ్.

మరిన్ని వార్తలు