36 పరుగులకే ఐదు వికెట్లు..

2 Oct, 2017 15:43 IST|Sakshi

అబుదాబి: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. శ్రీలంక నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ వరుసగా వికెట్లను కోల్పోయి ఎదురీదుతోంది. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 36 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాకిస్తాన్ కోల్పోయిన ఐదు వికెట్లలో నాలుగు వికెట్లు స్పిన్నర్లకు దక్కాయి. రంగనా హెరాత్, దిల్రువాన్ పెరీరా తలో రెండు వికెట్లు తీసి పాక్ కు షాకిచ్చారు. మరొక వికెట్ పేసర్ సురంగా అక్మల్ కు దక్కింది.

అంతకుముందు  69/4 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు.. యాసిర్ షా దెబ్బకు విలవిల్లాడారు. స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ యాసిర్ కు దాసోహమయ్యారు. లంక ఆటగాళ్లలో నిరోషాన్ డిక్ వెల్లా(40 నాటౌట్;76 బంతుల్లో 4 ఫోర్లు) మినహా ఎవరూ రాణించలేదు. ఫలితంగా శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 138 పరుగులకే చాపచుట్టేసింది.

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 419 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 138 ఆలౌట్

పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్  422 ఆలౌట్

మరిన్ని వార్తలు