భారత్‌-పాక్‌ మ్యాచ్‌: టాస్‌ పడిందోచ్‌!

16 Jun, 2019 14:41 IST|Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో అత్యంత ఆసక్తికరమైన భారత్‌-పాకిస్తాన్‌ల మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌  టాస్‌ గెలిచి  ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన పాక్‌ కెప్టెన్‌ సర్పరాజ్‌.. భారత్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. శిఖర్‌ ధావన్‌ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం కావడంతో అతని స్థానంలో విజయ్‌ శంకర్‌ తుది జట్టులోకి వచ్చాడు. వరుణుడు కాస్త తెరిపి ఇవ్వడంతో టాస్‌ పడింది. ఇక మ్యాచ్‌ మొత్తం జరగాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
(ఇక్కడ చదవండి: పాక్‌పై భారత్‌ కొట్టిన సిక్సర్‌!)

రెండేళ్ల క్రితం చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌... అప్పటి భారత్‌ టీమ్‌ బలాన్ని చూస్తే పాకిస్తాన్‌ చేతిలో ఓడిపోవడం అనూహ్యం. సరిగ్గా చెప్పాలంటే బలహీనంగా కనిపించిన పాక్‌ను తప్పుగా అంచనా వేసి కోహ్లి సేన బోల్తా కొట్టింది. ఇప్పుడు అదే ఇంగ్లండ్‌లో మరో ఐసీసీ ఈవెంట్‌లో ఇరు జట్లు తలపడబోతున్నాయి.  ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లలో ఓటమి లేకుండా విరాట్‌ బృందం ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

మరోవైపు పాకిస్తాన్‌ రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలు కావడంతో ఆ జట్టు ఒత్తిడిలో ఉంది.  ఫకార్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హఖ్, బాబర్‌ ఆజమ్‌లే పాక్‌ బ్యాటింగ్‌ బలం. బౌలింగ్‌లో వారి ప్రధాన వనరు మహ్మద్‌ ఆమిర్‌. అదే సమయంలో భారత్‌ బ్యాటింగ్‌ లైనప్‌ చాలా పటిష్టంగా ఉంది. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, ఎంఎస్ ధోని, హార్దిక్‌ పాండ్యా వంటి ఆటగాళ్లతో టీమిండియా బలంగా ఉంది. మరొకవైపు బౌలింగ్‌ విభాగంలో జస్‌ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌ల ప్రదర్శనే కీలకం. తాజా మ్యాచ్‌లో కచ్చితంగా టీమిండియానే ఫేవరేట్‌. వన్డే ప్రపంచకప్‌లో పాక్‌తో తలపడిన ఆరు సందర్భాల్లో భారత్‌ గెలవడంతో అదే పునరావృతం చేయాలని విరాట్‌ గ్యాంగ్‌ భావిస్తోంది. ఏది ఏమైనా దాయాదుల సమరం కాబట్టి ప్రతీ క్షణం ఆస్వాదించదగిందే.(ఇక్కడ చదవండి: గూగుల్‌లో అంతా అదే వెతుకులాట!)

తుది జట్లు

భారత్‌
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విజయ్‌ శంకర్‌, ఎంఎస్‌ ధోని, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌, బుమ్రా

పాకిస్తాన్‌
సర్పరాజ్‌ అహ్మద్‌(కెప్టెన్‌), ఇమాముల్‌ హక్‌, ఫకార్‌ జామాన్‌, బాబర్‌ అజామ్‌, మహ్మద్‌ హఫీజ్‌, షోయబ్‌ మాలిక్‌, ఇమాద్‌ వసీం, షాదబ్‌ ఖాన్‌, హసన్‌ అలీ, వహాబ్‌ రియాజ్‌, మహ్మద్‌ ఆమిర్‌


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు

ఇంగ్లాండ్‌ అలా గెలిచిందట.!