చాంప్స్‌ పలక్, జషన్‌ సాయి

8 Jul, 2019 14:04 IST|Sakshi

 క్యాడెట్‌ విభాగంలో శ్రీయ, జతిన్‌దేవ్‌లకు టైటిళ్లు

 స్టేట్‌ ర్యాంకింగ్‌ టీటీ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: సెయింట్‌ పాల్స్‌ వార్షిక తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ ఇంటర్‌ స్కూల్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పలక్‌ (జీఎస్‌ఎం), జషన్‌ సాయి (ఎంఎల్‌ఆర్‌), శ్రీయ (ఏడబ్ల్యూఏ), జతిన్‌ దేవ్‌ (ఎస్‌పీహెచ్‌ఎస్‌) సత్తా చాటారు. హైదర్‌గూడలో జరుగుతోన్న ఈ టోర్నీ క్యాడెట్‌ విభాగంలో జతిన్‌ దేవ్, శ్రీయ... సబ్‌జూనియర్‌ విభాగంలో జషన్‌ సాయి, పలక్‌ విజేతలుగా నిలిచారు. ఆదివారం సబ్‌ జూనియర్‌ బాలుర ఫైనల్లో జషన్‌ సాయి 11–5, 12–10, 9–11, 11–5, 11–9తో త్రిశూల్‌ మెహ్రా (ఎల్బీ స్టేడియం)పై గెలుపొందగా... బాలికల కేటగిరీలో పలక్‌ 9–11, 11–6, 11–7, 11–9, 14–12తో అనన్య (జీఎస్‌ఎం)ను ఓడించింది. మరోవైపు క్యాడెట్‌ బాలుర టైటిల్‌ పోరులో జతిన్‌ దేవ్‌ 13–11, 11–6, 11–8, 11–5తో తరుణ్‌ ముకేశ్‌ (ఆర్‌టీటీఏ)పై, బాలికల ఫైనల్లో శ్రీయ 7–11, 12–14, 11–9, 6–11, 11–7, 11–9, 12–10తో ప్రజ్ఞాన్ష (వీపీజీ)పై గెలుపొందారు. జూనియర్‌ బాలికల విభాగంలో భవిత (జీఎస్‌ఎం) చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో భవిత 9–11, 11–6, 11–9, 11–5, 11–9తో పలక్‌ (జీఎస్‌ఎం)ను ఓడించింది.

అంతకుముందు సెమీస్‌ మ్యాచ్‌ల్లో పలక్‌ 11–7, 11–5, 11–5, 11–7తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై, భవిత 11–9, 11–8, 11–9, 11–7తో విధి జైన్‌ (జీఎస్‌ఎం)పై గెలుపొందారు. బాలుర విభాగంలో కేశవన్‌ కన్నన్‌ (ఎంఎల్‌ఆర్‌), బి. వరుణ్‌ శంకర్‌ (జీటీటీఏ) ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీస్‌ మ్యాచ్‌ల్లో కేశవన్‌ కన్నన్‌ 10–12, 11–7, 11–8, 5–11, 11–7, 11–6తో జషాన్‌ సాయి (ఎంఎల్‌ఆర్‌)పై, వరుణ్‌ శంకర్‌ 15–13, 11–9, 11–4, 8–11, 11–9తో ప్రణవ్‌ నల్లారి (ఏడబ్ల్యూఏ)పై నెగ్గారు. యూత్‌ బాలికల సెమీఫైనల్లో ప్రణీత (హెచ్‌వీఎస్‌) 11–2, 11–4, 11–6, 11–6తో విధి జైన్‌ (జీఎస్‌ఎం)పై గెలుపొందగా... వరుణి జైస్వాల్‌ (జీఎస్‌ఎం) 11–5, 11–13, 11–8, 7–11, 11–3, 11–7తో రాగ నివేదిత (జీటీటీఏ)ను ఓడించింది. యూత్‌ బాలుర విభాగంలో స్నేహిత్‌ (జీటీటీఏ), అరవింద్‌ (ఏడబ్ల్యూఏ), మొహ్మమద్‌ అలీ (ఎల్‌బీఎస్‌) సెమీఫైనల్లో అడుగుపెట్టారు. పురుషుల క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో స్నేహిత్‌ (జీటీటీఏ) 11–9, 11–5, 11–7, 8–11, 8–11, 11–13, 11–8తో వి. చంద్రచూడ్‌ (ఎంఎల్‌ఆర్‌)పై, అమన్‌ (సీఆర్‌ఎస్‌సీబీ) 11–3, 11–7, 11–9, 11–6తో అరవింద్‌ (ఏడబ్ల్యూఏ)పై, అమన్‌ రహమాన్‌ (ఏవీఎస్‌సీ)11–9, 11–6, 5–11, 11–6, 11–6తో వరుణ్‌ శంకర్‌ (జీటీటీఏ)పై, మొహమ్మద్‌ అలీ (ఎల్‌బీఎస్‌) 6–11, 12–10, 11–6, 11–8, 12–10తో సరోజ్‌ సిరిల్‌ (ఏడబ్ల్యూఏ)పై గెలుపొంది సెమీఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల విభాగంలో మోనిక (జీఎస్‌ఎం), ప్రణీత (హెచ్‌వీఎస్‌), వరుణి జైస్వాల్‌ (జీఎస్‌ఎం), నిఖత్‌ బాను (ఆర్‌బీఐ) కూడా సెమీస్‌కు చేరుకున్నారు.

మరిన్ని వార్తలు