కపిల్‌ త్రయం చేతిలో... హెడ్‌ కోచ్‌ ఎంపిక బాధ్యత!

18 Jul, 2019 02:03 IST|Sakshi

క్రికెట్‌ పాలకుల కమిటీ యోచన

నిర్ణయాన్ని తప్పుబడుతున్నబీసీసీఐ వర్గాలు

న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్‌ నియామక ప్రక్రియను దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్, అన్షుమన్‌ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన తాత్కాలిక క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)కి అప్పగించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు నియమిత క్రికెట్‌ పాలకుల మండలి (సీవోఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారికంగా ప్రకటనేదీ రాకున్నా ఆ దిశగా ఆలోచనలు సాగుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మిగతా కోచింగ్, సహాయక సిబ్బంది నియామకం మాత్రం బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి పర్యవేక్షణలో సాగుతుంది. గతంలో సీఏసీ సభ్యులుగా నియమితులైన మేటి క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్, సౌరభ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌లు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో వివరణ ఇచ్చుకోవాల్సి రావడంతో... వారి స్థానంలో కపిల్‌ త్రయాన్ని తాత్కాలిక (అడహక్‌) ప్రాతిపదికపై నియమించారు. ఈ బృందమే డిసెంబరులో మహిళా జాతీయ జట్టు కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ను ఎంపిక చేసింది.

సీవోఏ తీరుపై బీసీసీఐ వర్గాల మండిపాటు
ప్రత్యేకించి అక్టోబరు 22న వార్షిక సర్వసభ్య సమావేశం ఉండగా... టీమిండియా కోచింగ్‌ సిబ్బంది నియామక ప్రకటన విషయంలో సీవోఏకు అంత తొందరేమిటని బీసీసీఐ వర్గాలు మండిపడుతున్నాయి. ఓవైపు ప్రపంచ కప్‌లో భారత్‌ ప్రదర్శనపై హెడ్‌ కోచ్, కెప్టెన్‌తో సమీక్ష సమావేశం నిర్వహణ కోరుతూనే, మరోవైపు కోచింగ్‌ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరడాన్ని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తప్పుబట్టారు. ‘ఈ పరిణామాలు నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం. సీవోఏ ఇప్పటికే బోర్డు ఎన్నికలకు తేదీలు వెల్లడించింది. ఇంతలోనే ఇదేమిటి? తమ ఉద్దేశంలో ఉన్న వ్యక్తుల్లో ఎవరినైనా వారు నియమించాలని, ప్రపంచ కప్‌ సాధించలేకపోయిన విషయాన్ని మరుగునపర్చాలని అనుకుంటున్నారా’ అని ఆ అధికారి ప్రశ్నించారు. ప్రస్తుత కోచింగ్‌ సిబ్బంది అందరూ తమతమ నివేదికలు సమర్పించాల్సి ఉన్న నేపథ్యాన్ని ఆయన ప్రస్తావించారు. విజయ్‌ శంకర్‌ గాయం తీవ్రత సహా, నాలుగో స్థానంపై తీసుకున్న నిర్ణయాలకు బ్యాటింగ్‌ కోచ్‌ కీలకమైన నివేదిక ఇవ్వాల్సి ఉండటాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అబొజర్‌కు తెలుగు టైటాన్స్‌ పగ్గాలు

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ: ఇషా సింగ్‌కు రజతం

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచకప్‌ ఎఫెక్ట్‌: రాయ్‌ తొలిసారి

యుముంబా కెప్టెన్‌ ఫజల్‌ అట్రాచలీ

పాండే సెంచరీ.. కృనాల్‌ పాంచ్‌ పటాక

‘ఇక ఆడింది చాలు.. వెళ్లిపోండి’

కూతేస్తే.. కేకలే

‘విశ్రాంతి వద్దు.. నేను వెళతాను!’

ఐసీసీ కీలక నిర్ణయం యాషెస్‌ నుంచే అమలు!

కోచ్‌ల కోసం తొందరెందుకు?

స్టోక్స్‌ వద్దన్నా.. అంపైర్లు వింటేగా

పంత్‌ కోసం ధోనీ చేయబోతుందిదే!

‘బౌండరీ’కి బదులు రెండో సూపర్‌

విలియమ్సన్‌పై రవిశాస్త్రి ప్రశంసలు

ఆ ‘స్పెషల్‌’ జాబితాలో రోహిత్‌శర్మ

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

గాయం బెడద భయం గొల్పుతోంది

ఆఖరి స్థానంతో సరి

మళ్లీ గెలిచిన గేల్‌

ప్రధానితో ప్రపంచకప్‌ విజేత

సిక్కి రెడ్డి జంటకు మిశ్రమ ఫలితాలు

సచిన్‌ ప్రపంచకప్‌ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లు

ఫైనల్లో పరాజితులు లేరు 

60 ఏళ్లకు మించరాదు! 

టీమిండియా కోచ్‌కు కొత్త నిబంధనలు!

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

‘ఇద్దరు పిల్లల తల్లి .. నాలుగు స్వర్ణాలు గెలిచింది’

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌