మెరిసిన పరశురామ్‌

18 Aug, 2019 10:02 IST|Sakshi

అంతర్‌ జిల్లా జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లా జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ తొలి రోజు పరశురామ్‌ (కామారెడ్డి), శివాని (ఖమ్మం), కావ్య (నల్లగొండ) స్వర్ణ పతకాలతో మెరిశారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్‌ స్టేడియంలో శనివారం జరిగిన బాలుర అండర్‌–14 లాంగ్‌ జంప్, ట్రయాథ్లాన్‌ విభాగాల్లో పరశురామ్‌ స్వర్ణాలు సాధించాడు. లాంగ్‌ జంప్‌లో పరశురామ్‌ 5.93 మీటర్ల దూరం దూకి మొదటి స్థానంలో నిలవగా... ఆర్‌.సెహ్వాగ్‌ (కామారెడ్డి) 5.89 మీటర్లు దూకి రెండో స్థానంలో... పి.లిఖిత్‌ అభినయ్‌ (భద్రాద్రి కొత్తగూడెం) 5.76 మీటర్లతో మూడో స్థానంలో నిలిచారు. బాలుర అండర్‌–14 ట్రయాథ్లాన్‌ విభాగంలో పరశురామ్‌ 1711 పాయింట్లతో పసిడి పతకాన్ని గెలవగా...    వివేక్‌ చంద్ర (ఖమ్మం) 1659 పాయింట్లతో   రజతాన్ని, నరేశ్‌ (టీఏఏ) కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. బాలికల అండర్‌–14 ట్రయాథ్లాన్‌ విభాగంలో శివాని (ఖమ్మం) 1609 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఝాన్సీ (హైదరాబాద్‌) 1523 పాయింట్లతో రజతాన్ని, ఎల్‌.వాణి (మహబూబాబాద్‌) 1278 పాయింట్లతో కాంస్యాన్ని దక్కించుకున్నారు.  

ఇతర పతక విజేతలు

అండర్‌–14 బాలుర విభాగం: 100మీ: 1.      ఎస్‌ హర్షవర్ధన్‌ (హైదరాబాద్‌) 2. ఎ.గౌతమ్‌ (ఖమ్మం). 3. బి. భాను ప్రకాశ్‌ (భద్రాద్రి     కొత్తగూడెం).  
హై జంప్‌: 1. కె.ప్రణయ్‌ (మంచిర్యాల) 2. బి.నరేశ్‌ (టీఏఏ) 3. బి.విష్ణువర్ధన్‌ (సిద్దిపేట).
అండర్‌–16 బాలుర విభాగం: 500మీ రేస్‌ వాక్‌: 1.రాజ్‌ మిశ్రా (రంగారెడ్డి) 2.డి.జగదీశ్‌ (నల్లగొండ) 3. ఎడ్ల విష్ణువర్ధన్‌ (జగిత్యాల).
డిస్కస్‌ త్రో: 1.ఇ. గణేశ్‌ (ఖమ్మం) 2. కె. ఆదినారాయణ (భద్రాద్రి కొత్తగూడెం) 3.ఎస్‌కె. అఫ్తాబ్‌ (ఖమ్మం)
100మీ: 1. కె.దిలీప్‌ (జగిత్యాల) 2. ఎ. తరుణ్‌ (కరీంనగర్‌) 3. రాహుల్‌ సాయి (సూర్యాపేట).
400మీ: 1.మహేశ్‌ (మంచిర్యాల) 2. కార్తీక్‌ (వరంగల్‌ అర్బన్‌) 3.వినీత్‌ కుమార్‌ (మహబూబ్‌నగర్‌)
బాలుర అండర్‌–18: 1000మీ రేస్‌ వాక్‌: 1. దుర్గారావు (వరంగల్‌ అర్బన్‌) 2. ఎస్‌. అజయ్‌ (ఆదిలాబాద్‌) 3. ఎ. ప్రదీప్‌ (సూర్యాపేట)
డిస్కస్‌ త్రో: 1. ప్రశాంత్‌ (వరంగల్‌ అర్బన్‌) 2. రాజు (వికారాబాద్‌) 3. శ్రీకాంత్‌ (నల్లగొండ).

లాంగ్‌ జంప్‌: 1. శ్రీకాంత్‌ (జయశంకర్‌     భూపాలపల్లి) 2. నిశాంక్‌ (సిద్దిపేట) 3.   మురళి (ఖమ్మం).
100మీ: 1. శ్రీకాంత్‌ నాయక్‌ (వరంగల్‌ అర్బన్‌) 2. జోగులు (రంగారెడ్డి) 3. శరత్‌ చంద్ర (రంగారెడ్డి).
400మీ: 1.అభిశేఖర్‌ (వరంగల్‌ అర్బన్‌) 2. వెంకట అఖిలేశ్‌ (రంగారెడ్డి) 3. హరీశ్‌ (వరంగల్‌ అర్బన్‌).
బాలుర అండర్‌–20: డిస్కస్‌ త్రో: యశ్వంత్‌ (వరంగల్‌ అర్బన్‌) 2. రాఘవేంద్ర (కరీంనగర్‌) 3. ప్రదీప్‌ (యాదాద్రి భువనగిరి).
షాట్‌పుట్‌: 1. సత్యవాన్‌ (హైదరాబాద్‌) 2. యశ్వంత్‌ (వరంగల్‌ అర్బన్‌) 3.తిరుమల్‌ (టీఏఏ)

100మీ: 1.రామ్‌ ప్రసాద్‌ (భద్రాద్రి కొత్తగూడెం) 2. నవీన్‌ కుమార్‌ (భద్రాద్రి కొత్తగూడెం) 3. ఎస్‌. సాయి (భద్రాద్రి కొత్తగూడెం).
400మీ: 1. శివతేజ వైభవ్‌ (నల్లగొండ) 2. వంశీ కృష్ణ (భద్రాద్రి కొత్తగూడెం) 3. పాండు నాయక్‌ (రంగారెడ్డి).
బాలికల అండర్‌–14: షాట్‌పుట్‌: 1. పూజ (మెదక్‌) 2. మనవిని (హైదరాబాద్‌) 3. వందన (భద్రాద్రి కొత్తగూడెం).
100మీ: 1. సుష్మిత (మహబూబాబాద్‌) 2. సాయి సంగీత (మహబూబ్‌నగర్‌) 3. కృతి (హైదరాబాద్‌).

బాలికల అండర్‌–16: 3000మీ రేస్‌ వాక్‌: 1. ఝాన్సీ (కరీంనగర్‌) 2. మౌనిక (మంచిర్యాల) 3. అక్షిత (జగిత్యాల).
షాట్‌పుట్‌: 1. వైష్ణవి (రంగారెడ్డి) 2.అదితి  సింగ్‌ (హైదరాబాద్‌) 3. నవ్య పండిత్‌      (హైదరాబాద్‌).
100మీ: 1.మాయావతి (నల్లగొండ) 2.       రాగవర్షిణి (హైదరాబాద్‌) 3. వమిక అనిల్‌ (మేడ్చల్‌).
బాలికల అండర్‌–18: 5000మీ రేస్‌ వాక్‌: 1. ధనూష (కరీంనగర్‌) 2. నవ్య (జగిత్యాల)    3. శ్రావణి (భద్రాద్రి కొత్తగూడెం).
100మీ: 1. దీప్తి (వరంగల్‌ అర్బన్‌) 2. కీష మోది (రంగారెడ్డి) 3. శ్లోక (రంగారెడ్డి).
బాలికల అండర్‌–20: 400మీ: 1. కావ్య (నల్లగొండ) 2.కీర్తి (హైదరాబాద్‌) 3. మౌనిక (నల్లగొండ).
బాలికల అండర్‌– 20 100మీ.: 1. కవిత (కరీంనగర్‌), 2. సుష్మా బాయి (భద్రాద్రి కొత్తగూడెం), 3. దివ్యా పావని (భద్రాద్రి కొత్తగూడెం).   

మరిన్ని వార్తలు