'ఫామ్‌లోనే ఉన్నా అయినా ఎంపిక చేయలేదు'

21 Apr, 2020 20:43 IST|Sakshi

ముంబై : 2008 ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర నిరాశ చెందానని భారత వికెట్ కీపర్ బ్యాట్స్​మన్ పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. అప్పటి జట్టులో రెండో వికెట్ కీపర్ స్థానం కోసం తాను పోటీలోనే ఉన్నానని తెలిపాడు. అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న తనను జట్టులోకి తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.టీమిండియా మాజీ ఆటగాడు ఆర్పీ సింగ్​తో మంగళవారం ఇన్​స్టాగ్రామ్ లైవ్​లో పార్థివ్ మాట్లాడాడు. ('అక్రమ్ అలా చేసుంటే అప్పుడే చంపేవాడిని')

'సరైన సమయంలో జట్టులో చోటు దక్కించుకోవడం చాలా ముఖ్యం. 2008 ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ఎంపిక చేసే సమయంలో మొదటి వికెట్ కీపర్​గా ధోనీ తన స్థానాన్ని పదిలం చేసుకోవడంతో నేను రెండో వికెట్ కీపర్ స్థానానికి పోటీలో నిలిచా. అయితే ఆ సమయంలో ఎంపిక కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యా. అప్పటి చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్​సర్కార్.. ​నాకు కాల్ చేసి.. నువ్వు మంచి ప్రదర్శన చేస్తున్నావు.. ఇలాగే కొనసాగించు అన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన కోసం నిన్ను ఎంపిక చేయడం లేదని పేర్కొన్నారని ' పార్థివ్ తెలిపాడు.

2008లో ఆసీస్‌ పర్యటనలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. అయితే ఈ సిరీస్‌ మొత్తం వివాదాల నడుమే కొనసాగింది. సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో హర్బజన్‌ సింగ్‌, ఆండ్రూ సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న మంకీ గేట్‌ వివాదం క్రికెట్‌ ప్రేమికులెవరు అంత తొందరగా మరిచిపోలేరు. 2002లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన పార్థివ్ పటేల్ తన కెరీర్‌లో 25 టెస్టులు, 38 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన పిన్నవయస్కుడిగా (17ఏండ్ల 153రోజులు) వికెట్ కీపర్​గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ హనీఫ్‌ మహ్మద్‌(17 ఏళ్ల 300 రోజులు) పేరిట ఉండేది.
('నా తమ్ముడు అప్పుడు.. ఇప్పుడు ఏం మారలేదు')

మరిన్ని వార్తలు