కశ్యప్‌ శుభారంభం

2 Aug, 2017 00:20 IST|Sakshi
కశ్యప్‌ శుభారంభం

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, ప్రణయ్, సిరిల్‌ వర్మ, సౌరభ్‌ వర్మ శుభారంభం చేయగా... రెండో సీడ్‌ అజయ్‌ జయరామ్‌ పరాజయం చవిచూశాడు. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో కశ్యప్‌ కేవలం 22 నిమిషాల్లో 21–5, 21–10తో రుంబాకా (ఇండోనేసియా)ను చిత్తుగా ఓడించాడు.

ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్‌ 21–14, 21–16తో రుస్తావితో (ఇండోనేసియా)పై, సౌరభ్‌ వర్మ 21–17, 21–15తో నాథన్‌ (ఆస్ట్రేలియా)పై, సిరిల్‌ వర్మ 21–13, 21–12తో రియాంతో సుబగ్జా (ఇండోనేసియా)పై గెలిచారు. అజయ్‌ జయరామ్‌  19–21, 13–21తో చియా హుంగ్‌ లూ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయాడు.

మరిన్ని వార్తలు